Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 24వ తేదీన ఎంతో శక్తివంతమైన మూడు యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో లాభాలు పొందబోయే రాశుల వారెవరో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 23, 2024, 09:48 AM IST
Rasi Phalalu: జూన్ 14న త్రిపుష్కర యోగం.. ఈ రాశుల వారికి ధనమే ధనం..

Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ గ్రహం జూన్ 23వ తేదీన ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. అలాగే జూన్ 24వ తేదీ ఆషాడ మాసంలోని కృష్ణపక్షం రెండవ తిథి కావడం వల్ల ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో బ్రహ్మయోగం, త్రిపుష్కర యోగం, సర్వార్థ సిద్ధి యోగాలు ఏర్పడడమే, కాకుండా ఆ తర్వాతి రోజున కూడా మరికొన్ని యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అయితే జ్యోతిష్య శాస్త్రంలో ఈ మూడు యోగాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో సింహ మకర రాశి వారితో పాటు మరికొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఊహించని ఫలితాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ మూడు యోగాలు ఏర్పడడం కారణంగా లాభాలు పొందబోయే రాశుల వారెవరో? వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

వృషభరాశి: 
వృషభ రాశి వారికి ఈ యోగాలు ఏర్పడిన రోజులు ఎంతో ప్రత్యేకంగా కాబోతున్నాయి. ఎందుకంటే వీరు ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ముఖ్యంగా వీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే పూర్తిగా రిలాక్స్ అవ్వడమే కాకుండా తెలివితేటలతో డబ్బులు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మంచి విజయాలు సాధిస్తారు. అలాగే వీరు ప్రతి పనిలో మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ యోగాల కారణంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది.

సింహరాశి: 
ఈ ప్రత్యేకమైన మూడు యోగాల కారణంగా సింహ రాశి వారు కూడా విపరీతమైన ధన లాభాలను పొందుతారు. ముఖ్యంగా వీరికి సూర్య భగవానుడి అనుగ్రహంతో కోరుకున్న కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీని కారణంగా మీరు కొత్త పెట్టుబడులను కూడా పెట్టవచ్చు. అలాగే గతంలో పెట్టిన పెట్టుబడులు మొత్తం డబ్బు రూపంలో తిరిగి వస్తాయి. అలాగే కొత్త వ్యాపారాలు కూడా ఎంతో అభివృద్ధి చెందుతాయి. ఇక కుటుంబ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

తులారాశి: 
తులా రాశి వారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా వీరు అదృష్టాన్ని పొందడమే కాకుండా అద్భుతమైన శుభవార్తలను వింటారు. అలాగే కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అనుకున్న పనులు కూడా ఎంతో సులభంగా జరుగుతాయి. దీంతోపాటు వీరు పాత స్నేహితులను కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. దీంతోపాటు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా గడపగలుగుతారు. అలాగే మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. దీని కారణంగా కాస్త మానసిక ఆనందం కూడా లభిస్తుంది. అలాగే ఎలాంటి పనులు చేసిన ఈ సమయంలో సమాజంలో మంచి పేరు సాధిస్తారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News