Saturn And Venus Conjunction: 2025లో ఈ రాశులవారు కోటీశ్వరులు కావడం ఖాయం! ఎందుకంటే..

Saturn And Venus Conjunction: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన శుక్ర శని గ్రహాల కలయిక వచ్చే ఏడాది జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఎప్పుడూ పొందలేని అదృష్టాన్ని పొందుతారు. అలాగే జీవితంలో ఎలాంటి సమస్యలున్న పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా కూడా మెరుగుపడతారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Nov 5, 2024, 09:37 AM IST
Saturn And Venus Conjunction: 2025లో ఈ రాశులవారు కోటీశ్వరులు కావడం ఖాయం! ఎందుకంటే..

Saturn And Venus Conjunction: కొంతమంది అయితే వారికి తెలియకుండానే రాత్రికి రాత్రే అదృష్టం పొంది ధనవంతులు అవుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది అయితే జీవితంలో ఎప్పుడూ పొందనంత డబ్బును కూడా పొందుతారు. ఇలా కలిసి రావడానికి ప్రధాన కారణం జాతకంలోని గ్రహ స్థితులు, ఏర్పడే యోగాలే కీలక పాత్ర పోషిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ కదలికలకు, తిరోగమనల వల్ల ఏర్పడే ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. దీనివల్ల వారి వ్యక్తిగత జీవితాల్లో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇలా కొన్ని రాశుల వారికి వచ్చే ఏడాది జరగబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వచ్చే సంవత్సరంలో సంపదకు సూచికగా భావించే సూర్యుడు, న్యాయానికి అధిపతి అయిన శని ఒకే రాశిలో కలవబోతున్నాయి.

Add Zee News as a Preferred Source

ఈ గ్రహాలు రెండు చాలా అరుదుగా ఒకే రాశిలో కలుస్తూ ఉంటాయి.. అలాంటప్పుడు ఎంతో ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడి, అది ద్వాదశరాశిల వారిపై ప్రభావం చూపుతుంది. దీంతో ఈ సమయంలో ఈ గ్రహాలు శుభ స్థానంలో ఉన్న కొన్ని రాశుల వారు ఎప్పుడూ పొందలేని అరుదైన ప్రయోజనాలను పొందుతారు. అలాగే ఎలాంటి తీవ్ర కష్టాలు ఉన్న అవి గట్టెకుతాయి.  దీంతోపాటు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా 2025 సంవత్సరంలో ఎనలేని లాభాలు పొందబోతున్న రాశులు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఈ రాశుల వారికి బోలెడు బెనిఫిట్స్: 
కర్కాటక రాశి 

ముఖ్యంగా శని, శుక్ర గ్రహాల కలయిక కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే కొన్ని ప్రత్యేకమైన రాశుల్లో కర్కాటక రాశి ఒకటి. ఈ రాశి వారికి పెద్ద లాటరీ తగిలిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఎలాంటి పనిని తలపెట్టిన అఖండ విజయాలు సాధించడమే కాకుండా భారీగా డబ్బు పొందుతారు. దీంతో పాటు ఈ రాశి వారు కొత్త ఇంటిని కూడా కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా వీరికి వాహనాలు కొనుగోలు చేయాలనుకునే కోరిక కూడా నెరవేరబోతోంది. అలాగే వీరు సొంతిల్లు కోసం కొత్త భూమిని కూడా కొనుగోలు చేస్తారు. ఎప్పుడు గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులను కూడా ఈ సమయంలో తిరిగి పొందుతారు. అలాగే ఈ డబ్బుల వల్ల కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. వీటిల్లో కూడా సక్సెస్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో ఎలాంటి కార్యాన్ని తలపెట్టిన బంపర్ లాభాలు పొందుతారు.

కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఎందుకంటే వీరికి శుక్రుడి సపోర్టు లభించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అసంపూర్ణంగా ఉన్న పనులైన సంపూర్ణంగా పూర్తవుతాయి. అలాగే వీరికి జీవితంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. గతంలో ఉన్న ఆర్థిక స్థాయిల కంటే ఇప్పుడు మరింత స్థాయి మెరుగుపడే ఛాన్స్ ఉంది. దీంతోపాటు వీరికి ఈ సమయంలో అన్ని రకాలుగా కలిసివచ్చే అద్భుతమైన అదృష్టాన్ని పొందుతారు. ఎంత కష్టపడితే ఎంత ఫలితాన్ని పొందుతారు. అలాగే కష్టాలు లేకుండా ఎంతో సులభంగా సుఖంగా పనుల్లో విజయాలు సాధించి అధిక మోతాదులో డబ్బులు సంపాదిస్తారు. ఇక ఏదైనా తీసుకునే నిర్ణయాలు పెద్దలతో ఒకటికి రెండుసార్లు చర్చించి తీసుకుంటే చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

వృషభ రాశి: 
వృషభ రాశి వారికి కూడా శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా వచ్చే ఏడాదిలో జాక్పాట్ మనీ పొందుతారు. వీరు ఏకంగా రాత్రికి రాత్రి ధనవంతులైతారు. అలాగే వీరికి సంపాదన పెరగడంతో పాటు జీవితంలో ఎప్పుడూ పొందలేని ఆనందం కూడా లభిస్తుంది.. ఇక ఎప్పటినుంచో చిన్నచిన్న వ్యాపారాలు చేసే వారికి కొత్త ఆదాయం వనరులు కూడా పెరుగుతాయి. దీని కారణంగా పెద్ద మొత్తంలో డబ్బులను ఆర్జిస్తారు. ఇక వస్తువు విగ్రహాలు చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోయి. భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా జీవించగలుగుతారు. దీంతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు. దీని కారణంగా మానసిక ప్రశాంతత మెరుగుపడుతుంది. అలాగే ఆనందం కూడా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎప్పటినుంచో కొత్త కొత్త దేశాలను సందర్శించాలనుకునే వారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు.

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Dharmaraju Dhurishetty

జీ తెలుగు న్యూస్‌లో దురిశెట్టి ధర్మరాజు సబ్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనకి తెలుగు మీడియా రంగంలో దాదాపు నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ వివిధ అంశాలకు సంబంధించిన తాజా వార్తలను రాస్తారు. 

...Read More

Trending News