Shani Margi 2023: త్వరలో ఈ 4 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?

Saturn direct Movement: న్యాయాధీశుడైన శనిదేవుడు త్వరలో నేరుగా నడవనున్నాడు. శనిదేవుడు యెుక్క ప్రత్యక్ష సంచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2023, 02:38 PM IST
Shani Margi 2023: త్వరలో ఈ 4 రాశులకు మంచి రోజులు.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Margi 2023 effect: మనం మంచి పనులు చేస్తే శుభ ఫలితాలను, చెడు పనులు చేస్తే శిక్షలను వేస్తాడు శనిదేవుడు. అందుకే ఇతడిని న్యాయదేవుడు మరియు కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. జూన్ 17న రివర్స్ లో నడవడం మెుదలుపెట్టిన శని 140 రోజుల తర్వాత అంటే నవంబరు 04న ప్రత్యక్ష మార్గంలో నడవనున్నాడు. శని మార్గ స్థితి నాలుగు రాశులవారికి ప్రయోజనాలను ఇవ్వనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చిక రాశి
శని దేవుడు మీ సంపద ఇంట్లో ఉంటాడు. ఇది డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను అందిస్తుంది. శని మహారాజు అనుగ్రహం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తీరుతాయి. ప్రతి పనిలో కచ్చితమైన విజయం ఉంటుంది.
మిధునరాశి
శని దేవుడు గమనంలో మార్పు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు ఆర్థికంగా బలపడతారు. బిజినెస్ చేసే వారు భారీగా లాభపడతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు ఈ సమయం బాగుంటుంది. 
సింహరాశి 
శనిదేవుడు ప్రత్యక్ష సంచారం సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు మంచి రోజులు మెుదలవుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలపడుతుంది. 
కుంభ రాశి
ఇదే రాశిలో శనిదేవుడు ప్రత్యక్షంగా మారనున్నాడు. ఇది కుంభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు ఉంటాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

Also Read: Vishwakarma Jayanti 2023: 50 ఏళ్ల తర్వాత అరుదైన యోగాలు, విశ్వకర్మ పూజతో అపారమైన ధనం పొందండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News