Saturn transit 2023: దీపావళికి ముందు ఈ 3 రాశులవారి ఇళ్లపై డబ్బు వర్షం.. ఇందులో మీ రాశి ఉందా?

Saturn transit 2023: కాలానుగుణంగా గ్రహాల కదలికలో మార్పు వస్తుంది. దీపావళికి ముందు శనిదేవుడు గమనంలో కూడా పెను మార్పు రాబోతుంది. ఇది మూడు రాశులవారికి లాభాలను ఇవ్వనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2023, 01:41 PM IST
Saturn transit 2023: దీపావళికి ముందు ఈ 3 రాశులవారి ఇళ్లపై డబ్బు వర్షం.. ఇందులో మీ రాశి ఉందా?

Shani Margi 2023 Effect:  మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అతడు తిరోగమనంలో ఉన్నాడు. నవంబర్ 04 నుంచి అతడు నేరుగా నడవటం మెుదలపెడతాడు. శని యెుక్క కదలికలో మార్పు కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం. 

కన్య రాశి
నవంబర్‌లో శని దేవుడు రాశి మార్పు కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. మీకు శని పీడ నుండి విముక్తి లభిస్తుంది. మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. 
వృషభం
శనిదేవుడు ప్రత్యక్ష సంచారం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. మీ ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. 
మిధునరాశి
శని ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. మీకు నవంబరు నుంచి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. మీ ఆర్థిక పరిస్థితి గత కంటే మెరుగుపడుతుంది. మీరు ఏదైనా ల్యాండ్ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఈ సమయంలో కెరీర్ కు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.

Also Read: Mars Transit 2023: ఇవాళ్టి నుంచి నెలరోజులు ఆ మూడు రాశులకు మహర్దశే, పట్టిందల్లా బంగారం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News