Shani Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ 3 రాశులవారికి ఊహించనంత డబ్బు..

Shani Transit 2023: వైదిక జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శని సంచారం వల్ల మూడు రాశులవారు ఊహించనంత దనాన్ని పొందుతారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2022, 02:10 PM IST
  • గ్రహాల్లోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు
  • కొత్త సంవత్సరంలో కుంభంలోకి ప్రవేశించనున్నాడు
  • ఇది కొందరికి శుభప్రదంగా ఉండనుంది.
Shani Transit 2023: 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి శనిదేవుడు.. ఈ 3 రాశులవారికి ఊహించనంత డబ్బు..

Shani Transit In Kumbh Rashi 2023: పంచాంగం ప్రకారం, అన్ని గ్రహాల్లోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు. మకరం మరియు కుంభరాశికి శనిదేవుడు అధిపతి. ప్రస్తుతం శనిగ్రహం మకరరాశిలో సంచరించాడు. వచ్చే ఏడాది జనవరి 17, 2023న కుంభరాశిలో శని సంచరించనున్నాడు. ఈ సంచారం ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. దీంతో మీరు కెరీర్ లోఅపారమైన పురోగతిని సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునం(Aries): శని దేవుడి రాశి మార్పు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మీ రాశి నుండి తొమ్మిదో ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీంతో అదృష్టం మీ వెంటే ఉంటుంది. వ్యాపారం చేసే వారు ఎంతో ప్రయోజనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థికంగా మీరు లాభపడతారు. విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తారు. 

సింహం (Leo): శని దేవుడి సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఏడవ మరియు ఎనిమిదవ ఇంటికి కారకుడు అయిన శని ఏడవ ఇంటిలో సంచరిస్తుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. భాగస్వామ్యంతో చేసే పనులు లాభిస్తాయి. వ్యాపారులకు, ఉద్యోగులకు కూడా ఈసమయం బాగానే ఉంటుంది. 

తుల (Libra): శని దేవుడి సంచారం తుల రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి ఐదవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. దీంతో సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు డబ్బును ఆదా చేయవచ్చు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Grah Gochar 2022: నవంబర్‌లో అరుదైన యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News