Saturn Transit 2022: మకరరాశిలో శని తిరోగమనం.. ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Saturn Transit July 2022: రేపు శని రాశిని మార్చబోతున్నాడు. ఈ నేపథ్యంలో మెుత్తం 12 రాశులపై శని సంచారం ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2022, 03:32 PM IST
  • రేపు రాశిని మార్చబోతున్న శని
  • మకరరాశిలో శని సంచారం
  • కొన్ని రాశులకు లాభం, కొన్ని రాశులకు నష్టం
Saturn Transit 2022: మకరరాశిలో శని తిరోగమనం.. ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

Saturn Transit 2022 to 2023: మనం చేసే పనులను బట్టి ఫలాలను ఇస్తాడు శనిదేవుడు. శని రేపు అంటే జూలై 12, 2022న రాశిని మార్చబోతుంది. ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమనంలో ఉన్న శని.. రేపు మకరరాశిలోకి (Saturn Retrograde in Capricron 2022) ప్రవేశించనుంది. ఈ తిరోగమన శని సంచారం మెుత్తం 12 రాశిచక్రాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇది మంచైనా కావచ్చు లేదా చెడు అయినా కావచ్చు. శని యెుక్క శుభ దృష్టి పేదవాడిని ధనవంతుడిని చేస్తుంది, శని చెడు దృష్టి రాజును సైతం బంటును చేస్తుంది. శని సంచారం ఏ రాశిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. 

మేషం (Aries): శని సంచారం వల్ల మేష రాశివారి జీవితం ఒడిదొడుకులకు లోనవుతుంది. వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. ఆఫీసులో ఎవరితోనూ విభేదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది.  
వృషభ రాశి (Taurus): కెరీర్ లో పురోగతి ఉంటుంది. కొత్త జాబ్ వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీ ప్లాన్స్ ను ఎవరితోనూ పంచుకోవద్దు. కుటుంబ వివాదాలకు దూరంగా ఉండండి. 
మిథునం (Gemini): శని సంచారం వల్ల మిథున రాశి వారికి ఇబ్బందులు కలగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. ఆస్తి సంబంధిత విషయాలు మీకు సమస్యలు సృష్టించవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి.  
కర్కాటక రాశి (Cancer): మకరరాశిలో శని సంచారం కర్కాటక రాశికి కలిసి వస్తుంది. వీరికి మంచి రోజులు రాబోతున్నాయి. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి.
సింహం (Leo): సింహ రాశి వారికి శని సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. వ్యాపారపరమైన ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. 
కన్య (Virgo): మకరరాశిలో శని ప్రవేశం వల్ల కన్య రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కష్టపడి పనిచేస్తేనే విజయం వరిస్తుంది. 

తుల (Libra): శని సంచారం తుల రాశి వారికి బంపర్ సక్సెస్ ఇస్తుంది. ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఈ సమయంలో వీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio): శని సంచారం వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో లాభాలను తెస్తుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius): శని రాశి మారడం వల్ల ధనుస్సు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంట్లో ఎవరితోనైనా గొడవలు రావచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి
మకరం (Capricron): మకరరాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
కుంభం (Aquarius): శని మార్పు కుంభరాశికి శుభ ఫలితాలను ఇస్తుంది. వీరిపై శని అనుగ్రహం కురుస్తుంది. మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మిమ్మిల్ని పెద్ద పదవి వరించే అవకాశం ఉంది. 
మీనం (Pisces): శని సంచారం మీనరాశి వారికి వ్యాపారంలో లాభాలను తెస్తాయి. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. పూర్వీకుల ఆస్తులు లభిస్తాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 

Also read: Hartalika Teej Vrat: హర్తాళికా తీజ్ ఎప్పుడు? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి? 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News