Shani Dev: కుంభంలో ఉదయించబోతున్న శని... హోలీకి ముందు ఈ రాశుల జీవితం నాశనం..

Shani Uday Holi 2023:  హోలీకి ఒక్క రోజు ముందు శనిదేవుడు కుంభరాశిలో ఉదయించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు సమస్యలను ఎదుర్కోనున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 3, 2023, 06:38 PM IST
Shani Dev: కుంభంలో ఉదయించబోతున్న శని... హోలీకి ముందు ఈ రాశుల జీవితం నాశనం..

Shani Uday Holi 2023:  కర్మ ప్రదాత మరియు న్యాయదేవుడు అయిన శనిదేవుడు గమనంలో హోలీకి ముందు పెను మార్పు రాబోతుంది.  మార్చి 6వ తేదీ రాత్రి 11.36 గంటలకు శనిదేవుడు కుంభరాశిలో ఉదయింబోతున్నాడు. ఈ గ్రహ పరిణామం వల్ల కొన్ని రాశులవారికి సమస్యలు పెరుగుతాయి. మార్చి 6 తర్వాత ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి (Aries)
మేష రాశి వారికి సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆ ఆలోచన విరమించుకోండి. ఈ సమయంలో మీ ఖర్చులు పెరుగుతాయి. మీకు రాబడి తగ్గే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo)
శని ఉదయించడం వల్ల కన్యా రాశి వారికి కష్టాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో మనస్పర్దలు వస్తాయి. వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ మాటలను అదుపులో ఉంచుకుంటే మంచిది.
వృశ్చిక రాశి (Scorpio)
వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. బిజినెస్ లో పెద్ద డీల్ రద్దయి అవకాశం ఉంది. కెరీర్ లో అడ్డంకులు ఎదురవుతాయి. మెుత్తానికి ఈ సమయం సమస్యలతో నిండి ఉంటుంది. 
మకరరాశి (Capricorn)
శని ఉదయించడం వల్ల మకరరాశి వారికి ఇబ్బంది కలుగుతుంది. ఆస్తి విషయంలో తోబుట్టువులతో విభేదాలు రావచ్చు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. వ్యాపార, ఉద్యోగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. మీరు కెరీర్ కు సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. 
మీనరాశి (Pisces)
ఈ సమయంలో మీరు ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. డబ్బు దుబారా మానుకోండి. వ్యాపార, ఉద్యోగాల్లో లాస్ వచ్చే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. 

Also Read: Meena Sankranti 2023: సూర్యభగవానుడి మీనరాశి ప్రవేశం.. ఈ రాశులకు అదృష్టం, ఐశ్వర్యం.. ఇందులో మీది ఉందా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News