Lemon and chilli beliefs: రోడ్లపై, గమ్మాల్లో మిర్చీ, నిమ్మకాయలు ఎందుకుంటాయో తెలుసా

Lemon and chilli beliefs: మనం చాలా సందర్భాల్లో తరచూ రోడ్లపై, ఇంటి గుమ్మాల్లో మిర్చీలు, నిమ్మకాయలు చూస్తుంటాం. ఇలా ఎందుకుంటాయో, దీనివెనుక కారణమేముందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 24, 2022, 11:37 PM IST
Lemon and chilli beliefs: రోడ్లపై, గమ్మాల్లో మిర్చీ, నిమ్మకాయలు ఎందుకుంటాయో తెలుసా

Lemon and chilli beliefs: మనం చాలా సందర్భాల్లో తరచూ రోడ్లపై, ఇంటి గుమ్మాల్లో మిర్చీలు, నిమ్మకాయలు చూస్తుంటాం. ఇలా ఎందుకుంటాయో, దీనివెనుక కారణమేముందో తెలుసుకుందాం..

ఇండియాలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న సాంప్రదాయాలు, అలవాట్లు, నమ్మకాలుంటాయి. ఆ నమ్మకాలు, అలవాట్లు చూస్తుంటే..లాజిక్ ఏంటనే సందేహాలు వస్తుంటాయి. చాలామంది ఇళ్ల ముందు, దుకాణాల ముందు నిమ్మకాయలు, మిర్చి పడేస్తుంటారు. కొంతమంది దీన్ని ఓ అంధవిశ్వాసంగా చెబుతుంటారు. కానీ దీని వెనుక ఓ రహస్యం దాగుందని తెలుసా అంటున్నారు ఇంకొందరు.

నిమ్మకాయులు, ఎండి మిర్చి వెనుక లాజిక్ ఇదే

ఇళ్ల వాకిట, దుకాణాలు, కార్యాలయాల ముందు నిమ్మకాయలు, ఎండుమిర్చి విసిరేసి ఉండటం చూస్తుంటాం. చెడు దృష్టి నుంచి రక్షించుకునేందుకే ఇలా చేస్తుంటారు. కొంతమంది దీనికి అంధ విశ్వాసమని కొట్టిపారేసినా..దీని వెనుక సైన్స్ ఉందంటారు ఇంకొందరు. ఆ సైన్స్ ఏంటో చూద్దాం. నిమ్మకాయ చూసిన వెంటనే ఎవరికైనా పులుపుతనం భావన మనసులో కలుగుతుంది. ఫలితంగా చెడుదృష్టితో చూసేవాళ్లు ఎక్కువసేపు అక్కడుండేందుకు ఇష్టపడరు. నిమ్మకాయ నుంచి వెలువడే పులుపుతనం చాలా వేగంగా చెడువాసన కల్గిస్తుంది. అదే విధంగా ఎండుమిర్చిలో ఉండే ఘాటు కూడా ఇందుకు కారణమౌతుంది. అందుకే ఈ రెండడు ఒకేసారి గుమ్మంపై తగిలిస్తుంటారు లేదా ఇంటి ముందు వేస్తుంటారు. ఫలితంగా ఇంటిలోపల దోమలు, ఈగలు కూడా రావు. 

సైన్స్ ప్రకారం నిమ్మకాయలు, మిర్చిలో కీటకాల్ని చంపే గుణాలున్నాయి. అందుకే ఈ రెండింటినీ గుమ్మానికి తగిలించడం ద్వారా అక్కడి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. వాస్తుపరంగా కూడా ఇది మంచిదంటున్నారు. వాస్తు ప్రకారమైతే..ఈ రెండింటినీ కలిపి గుమ్మానికి తగిలిస్తే..నెగెటివిటీ దరి చేరదని నమ్మకం. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ భావన కలుగుతుంది. అందుకే వాస్తుశాస్త్రం ఇంట్లో నిమ్మచెట్టు పెంచమని చెబుతుంటుంది.

Also read: Skin Care Tips: చర్మ సంరక్షణకు సీజన్‌తో సంబంధముందా, ఏం చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News