Shani Dev Asta 2023: కుంభంలో శనిదేవుడి అస్తమయం.. ఈ రాశుల జీవితం కష్టాలమయం..

Shani Dev Asta 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. దీని వల్ల 4 రాశులవారికి కష్టాలు పెరుగుతాయి.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 12, 2023, 04:38 PM IST
Shani Dev Asta 2023: కుంభంలో శనిదేవుడి అస్తమయం.. ఈ రాశుల జీవితం కష్టాలమయం..

Shani Dev Asta 2023: గ్రహాలు కాలానుగుణంగా అస్తమిస్తాయి. అలాగే కర్మదాత అయిన శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో అస్తమించాడు. ఏదైనా గ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు అది సెట్ అవుతుంది. అస్తమయం చెందిన ఏ గ్రహమైనా మంచి ఫలితాలను ఇవ్వదు. శనిదేవుడు కూడా అంతే. ఈ సమయంలో ముఖ్యంగా నాలుగు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశులవారు జాగ్రత్త

కర్కాటక రాశిచక్రం (Cancer)
శని దేవుడి అస్తమయం కర్కాటక రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ ఏడవ మరియు ఎనిమిదవ అధిపతి. ఈ సమయంలో మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి, నష్టపోయే అవకాశం ఉంది. 
మిథున రాశిచక్రం (Gemini)
శనిదేవుడి యొక్క అస్తమయం ఈ రాశివారికి అశుభకరంగా ఉంటుంది. ఎందుకంటే శనిదేవుడు మిథున రాశి యెుక్క తొమ్మిదవ మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి. మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. ఈ సమయంలో డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. 
మకర రాశిచక్రం (Capricorn)
శని దేవుడి పూర్తి సెట్టింగ్ మీకు హానికరం. ఎందుకంటే మీ లగ్నానికి శనిదేవుడు అధిపతి. అందుకే ఈ సమయంలో మీకు జ్వరం రావచ్చు. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉంది. 
కుంభం (Aquarius)
ఈరాశిలోనే శని అస్తమయం జరగనుంది. దీంతో మీ ఆరోగ్యం పాడయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి లగ్నానికి మరియు 12వ ఇంటికి అధిపతి. అందుకే ఈ సమయంలో మీపై తప్పుడు కేసు పెట్టొచ్చు. మీరు చేస్తున్న పని  చెడిపోయే అవకాశం ఉంది. 

Also Read: Grah Gochar 2023: త్వరలో మేషంలో అరుదైన కలయిక.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News