Rajyog: కుంభరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..

Shukra And Budh Yuti: వైదిక జ్యోతిష్యం ప్రకారం, కుంభరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని వల్ల 3 రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2023, 01:20 PM IST
Rajyog: కుంభరాశిలో లక్ష్మీ నారాయణ రాజయోగం.. ఈ రాశులకు చెప్పలేనంత ధనం..

Lakshmi Narayan Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుస్తాయి. ఫిబ్రవరి ప్రారంభంలో కుంభరాశిలో బుధుడు మరియు శుక్రుడు కలయిక జరగబోతుంది. దీని వల్ల అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతుంది. ఈరాజయోగాన్ని ఆస్ట్రాలజీలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ యోగం మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

సింహ రాశి
లక్ష్మీ నారాయణ రాజయోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. పార్టనర్ షిప్ తో చేసే పనుల్లో మీకు లాభం ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. వ్యాపారుల భారీగా లాభపడతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 

మిథున రాశిచక్రం
లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడటంతో మిథున రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం శుభప్రదంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. చిక్కుకున్న ధనం మీకు అందుతుంది. పనిలో విజయం దక్కుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 

వృశ్చిక రాశిచక్రం
లక్ష్మీ నారాయణ రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలోని నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది.  ఈ సమయంలో మీరు సకల భౌతిక సుఖాలను పొందుతారు. మీరు ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం  కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఫ్యామిలీ సపోర్టు కూడా లభిస్తుంది. 

Also Read: Shani Shukra yuti 2023: 30 ఏళ్ల తర్వాత కుంభంలో శని, శుక్రుల కలయిక.. ఈ రాశులకు మంచి రోజులు మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News