Shukra Rashi Parivartan November 2022: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కేవలం శుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నవంబర్ 11 శుక్రుడి రాశి చక్రంలో పలు రకాల మార్పులు రాబోతున్నాయి. శుక్ర గ్రహం వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నారు. దీంతో పలు రాశుల్లో మార్పులు రాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ క్రమంలో 12 రాశులలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను కలిగే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణుల తెలుపుతున్నారు. శుక్రుడు రాశి మారడం వల్ల కొన్ని రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి చాలా రకాల లాభాలు పొందబోతున్నారని శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఏయో రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి చాలా ప్రయోజనాలు పొందుతారు:
మేషరాశి:
మేషరాశికి శుక్రుని సంచారం చాలా లాభాలు పొందే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచార సమయంలో ఉద్యోగ రంగంలో ప్రమోషన్ పొందుతారు. కుటుంబం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ క్రమంలో మేష రాశి వారు వాహనాలు కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా రోజువారీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పొందే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా బలపడే అవకాశాలున్నాయి.
మిధునరాశి:
ఈ సంచారం వల్ల మిధునరాశి వారికి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారు ఉద్యోగానికి సంబంధించి కొత్త శుభవార్తలు పొందుతారు. అంతేకాకుండా ఖర్చులు తగ్గి ఆదాయం కూడా పెరగుతుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో వైవాహిక జీవితం ఆనందంగా ఉంటారు. మనసుకు ప్రశాంత లభిస్తుంది. అయితే ఈ క్రమంలో పెట్టుబడులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు పొందుతారని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
వృశ్చిక రాశి:
శుక్ర సంచార సమయంలో నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వ్యాపార సంస్థల్లో, ఉద్యోగ రంగంలో వీరిపై గౌరవం పెరుగుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు పొందే అవకాశం ఉంటుందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పూర్తిగా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో ఏ పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా పొందుతారు.
Also Read : KomatiReddy Rajagopal Reddy: తమ్ముడు ఓటమికి అన్న కారణామా?.. రాజ్ గోపాల్ రెడ్డి కొంపముంచిన కాంగ్రెస్
Also Read : Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ నుంచి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సస్పెండ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook