Solar Eclipse 2023: హిందూమతం విశ్వాసాల ప్రకారం జ్యోతిష్యశాస్త్రానికి అత్యధిక ప్రాదాన్యత ఉంది. గ్రహణాలను జ్యోతిష్యశాస్త్రం అత్యంత అశుభ సూచకంగా భావిస్తుంది. ఈ ఏడాది ఏర్పడనున్న చవరి సూర్య గ్రహణం ఇవాళే. ఇండియాలో కన్పించకపోయినా రెండు రాశులకు మాత్రం అత్యంత ప్రమాదకరం కానుంది.
జ్యోతిష్యంలో గ్రహణానికి చాలా మహత్యముంది. ఇవాళ ఏడాదిలో చివరి సూర్య గ్రహణం. దీని ప్రభావం అన్ని రాశులపై పడనుంది. ఈ సూర్య గ్రహణం అశ్విని మాసంలోని అమావాస్య లేదా పితృ అమావాస్య నాడు ఏర్పడుతోంది. అందుకే కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. ఇవాళ్టి గ్రహణం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఈ గ్రహణం పితృ అమావాస్య నాడు ఏర్పడుతోంది. అంటే ఇవాళ పూర్వీకులకు వీడ్కోలు ఇచ్చే రోజు. జ్యోతిష్యం ప్రకారం అక్టోబర్ 14న ఏర్పడుతున్న సూర్య గ్రహణం కొన్ని రాశులకు అశుభంగా ఉంటుంది. అందుకే ఈ రెండు రాశులవాళ్లు చాలా అప్రమత్తంగా ఉండాలి.
హిందూమతం, జ్యోతిష్యం ప్రకారం సూర్య గ్రహణాన్ని అశుభ సంకేతంగా భావిస్తారు. మత విశ్వాసాల ప్రకారం సూర్య గ్రహణం సందర్భంగాల సూర్యుడు అస్తమిస్తాడు. దీనివల్ల వాతావరణంలో ప్రతికూల ప్రబావం లేదా ప్రతికూల శక్తులు పెరుగుతాయి. అందుకే గ్రహణం సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు హెచ్చరిస్తుంటారు. ఇవాళ అక్టోబర్ 14న అశ్విని మాసం. సూర్య గ్రహణం ఇవాళ రాత్రి 8.34 గంటలకు ప్రారంభమై రాత్రి 2.25 గంటలకు పూర్తవుతుంది. ఈ గ్రహణం ముఖ్యంగా 2 రాశులకు మంచిది కాదంటారు. ఈ రెండు రాశుల జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి.
కన్యా రాశి జాతకులు ఇవాళ సూర్య గ్రహణం సందర్భంగా చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఏ పనీ ముందుకు సాగదు. చేపట్టిన పనుల్లో పరాజయం ఎదురుకావచ్చు. ధనస్సు రాశి జాతకులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి నిలిచిపోతుంది. వ్యాపారులకు నష్టాలుంటాయి. ఆర్దికంగా సమస్యలు తప్పవు. ఆరోగ్య విషయాల్లో కూడా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా కెరీర్ ప్రశ్నార్ధకం కావచ్చు.
సింహ రాశి జాతకులకుఈ సమయం మంచిది కాదంటారు. ఈ రాశివారికి జీవితంలో ఒకేసారి వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టవచ్చు. మానసిక సమస్యలు ఎక్కువ కావడంతో ఒత్తిడి అధికమౌతుంది. జీవితంలో ఎత్తుపల్లాలు కచ్చితంగా ఉంటాయి. వీటిని తట్టుుకుని ముందుకు సాగాలి. సమాజంలో గౌరవ మర్యాదలు క్షీణిస్తాయి. ఆర్ధిక పరిస్థితి మరింతగా దిగజారవచ్చు.
Also read: Solar Eclipse 2023: త్రిగ్రహ యోగం ప్రభావంతో ఈ సూర్య గ్రహణం మహర్దశ కల్గించనుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook