Solar Eclipse In 2024: 2024 సంవత్సరంలోని మొదటి సూర్యగ్రహణం అతి త్వరలో రాబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంవత్సరంలో వచ్చే మొదటి సూర్య, చంద్ర గ్రహాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహం ఏప్రిల్ 8న ఏర్పడబోతోంది. ఈ ఏప్రిల్‌లో ఏర్పడబోయే గ్రహణం సంపూర్ణగా రాబోతుందని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం అన్ని దేశాల్లో సమానంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ గ్రహణం భారతదేశంలో మాత్రం కనిపించదని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ఈ సమయంలో ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ గ్రహణం కారణంగా ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం ఎప్పుడు?
త్వరలోనే ఏర్పడబోతున్న సంపూర్ణ సూర్యగ్రహణం ఏడేళ్లలో రెండవదిని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్రహణం ఏర్పడే సమయంలో సూర్యుడు గరిష్ట కార్యాచరణలో ఉంటుంది. గతంలో కూడా సంపూర్ణ సూర్యగ్రహణం 2017 ఏర్పడింది. ఆ తర్వాత ఈ సూర్యగ్రహణం రాబోతోంది. దీంతో పాటు ఈ సమయంలో రాహువు గ్రహం ప్రభావం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి శుభ కార్యాలు జరగవని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. దీంతో పాటు గ్రహణానికి ముందు సూతక కాలం కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈ సమయాల్లో కూడా శుభ కార్యాలు జరపడం నిషిద్ధమని నిపుణులు తెలుపుతున్నారు. సూర్యగ్రహణం రోజున సూతకం 12 గంటలు ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు 11 గంటల ముందు కూడా సూతక కాలం ప్రారంభమవుతుంది. చంద్రగ్రహణానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి:
సూర్యగ్రహణం కారణంగా వృశ్చిక రాశి వారికి కొంత నిరాశ కలిగే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో చాలా రకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వ్యాపారాలు చేస్తున్నవారు అనేక ఇబ్బందుల పడాల్సి వస్తుంది. దీంతో పాటు ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తుల రాశి:
ఈ సంవత్సరంలో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరికి వృత్తి జీవితంతో కీలక మార్పులు వచ్చి ససమ్యలు కూడా రావచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter