Sravana masam 2022: శ్రావణమాసం వచ్చేసింది. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ నెలలో శివ కటాక్షం కోసం ఏం చేయాలనేది చాలా ముఖ్యం. శ్రావణ మాసంలో శివపూజలు ఎలా చేయాలి, శివుడికి ఏవిష్టం. ఏవి కావనేది తెలుసుకోవల్సిన అవసరం కూడా ఉంది.
శ్రావణమాసం అనేది శివుడికి సమర్పితం. ఈ నెలలో శివుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తే భక్తుల కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. రేపట్నించి అంటే జూలై 14 నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా శివుడికి ఇష్టమైన వస్తువుల్ని పూజా సామగ్రిలో భాగంగా చేసుకుంటే..శివుడు ప్రసన్నుడై ఆశీర్వాదం అందిస్తాడని అంటారు. శ్రావణమాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేముందు శివుడికి ఏవిష్టం ఏవి కాదనేది తెలుసుకుందాం..
శివుడికి ఇష్టమైనవి
శ్రావణమాసంలో శివుడిని పాలతో అభిషేకం చేస్తారు. శివుడికి పాలంటే చాలా ఇష్టమని అంటారు. సముద్ర మథనం సందర్భంగా విషాన్ని గొంతులో అమర్చుకోవడం వల్ల గొంతు మంటను తగ్గించేందుకు నాడు దేవతలు పాలతో శివునికి అభిషేకం చేశారని చెబుతారు. అప్పట్నించి శివునికి పాలతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. శివుడికి గన్నేరు పూలంటే కూడా చాలా ఇష్టం. గన్నేరు పూలతో శివుడు ప్రసన్నుడై..భక్తులు కోరుకున్నవి నెరవేరుస్తాడని ప్రతీతి. శివునికి థతూరా, బేళపత్రం, చందనం, కేసరి, భంగ్, అత్తరు, అక్షింతలు, పంచదార, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం, చెరకు రసం చాలా ఇష్టం. శ్రావణమాసంలో పూజాసామగ్రిలో వీటిని భాగంగా చేసుకోవడం వల్ల శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.
శివుడికి అయిష్టమైన పదార్ధాలు
శివుడికి ఎప్పుడూ పొరపాటున కూడా కొబ్బరి కాయలు సమర్పించకూడదు. శివుడి పూజలో ఎప్పుడూ తులసీ ఆకులు వేయకూడదు. కేతకి, కేవడే పూలు శివుడి పూజా సామగ్రిలో నిషేధిత వస్తువులు. శివుడి పూజలో శంఖం నిషేధం. శివుడికి ఎల్లప్పుడూ చందనం పూయాలి. కుంకుమ ఎప్పుడూ వాడకూడదు.
Also read: Mars Transit 2022 Effect: మరో 8 రోజుల్లో రాశిని మార్చబోతున్న కుజుడు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook