Benefits of Trigrahi Yog 2023: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. అక్టోబరులో కూడా కొన్ని గ్రహాల గమనంలో మార్పు రాబోతుంది. అక్టోబరు 01న మూడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, కుజుడు మరియు బుధుడు కన్యారాశిలో కలవబోతున్నాయి. ఈ మూడు గ్రహాల సంయోగం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రిగ్రాహి యోగం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
ధనుస్సు రాశి
ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం ఊహించని లాభాలను ఇస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనం పొందుతారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
మిధునరాశి
త్రిగ్రాహి యోగం మిథునరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీకు పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
సింహరాశి
సూర్యుడు, బుధుడు మరియు కుజుడు కలయిక సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో వృద్ధి కనిపిస్తుంది. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook