Bhadli Navami 2022 Significance: ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం నాడు భడ్లీ నవమిని జరుపుకుంటారు. చాతుర్మాసం, శ్రావణ మాసం ప్రారంభానికి ముందు భడ్లీ నవమిని మరో ముఖ్యమైన రోజుగా భావిస్తారు. హిందూమతంలో భడ్లీ నవమికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది అక్షయ తృతీయను పోలి ఉంటుంది. వివాహాలకు భడ్లీ నవమి (Bhadli Navami 2022) చాలా మంచి రోజు. ఈరోజుతో పెళ్లి ముహర్తాలు లాస్ట్ అన్న మాట. భడ్లీ నవమిని ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. దీనికే భడ్ల నవమి, భడ్ల్య నవమి, కందర్ప నవమి వివిధ పేర్లు కలవు.
భడ్లీ నవమి 2022 తేదీ
ఈ ఏడాది భడ్లీ నవమి జూలై 7వ తేదీ గురువారం రాత్రి 07:28 గంటలకు ప్రారంభమై... జూలై 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 06:25 గంటలకు ముగుస్తుంది. జూలై 8వ తేదీ శుక్రవారం నాడు భడ్లీ నవమి జరుపుకుంటారు. ఉదయ తిథి జులై 8వ తేదీ కనుక పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలకు సాయంత్రం 6.30 గంటల వరకు మాత్రమే శుభ ముహూర్తం ఉంటుంది. దీని తరువాత, తదుపరి 4 నెలల పాటు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు.
ఈ సంవత్సరం భడ్లీ నవమి నాడే శివ, సిద్ధ, రవి యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ యోగాలలో చేసే పనులు శుభ ఫలితాలను ఇస్తాయి. ఇల్లు మరియు కారు కొనడానికి ఇదే మంచి సమయం.
Also Read: Sravana Somavaram 2022: శ్రావణ మాసం మెుదటి సోమవారం ఎప్పుడు? శివారాధన ఎలా చేయాలి?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook