Surya Nakshatra Parivartan 2022 Effect on Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, సూర్యుడు జూన్ 22న రాశిని (Sun Transit Effect) మార్చాడు. సూర్యుని రాశిలో మార్పు ప్రజల జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. గ్రహాలకు రాజు జూలై 6 వరకు అదే రాశిలో ఉంటాడు. తాజాగా సూర్యుడు ఆర్ద్ర నక్షత్రంలోకి (ardra nakshatra) ప్రవేశించాడు. ఈ సమయంలో 3 రాశులవారికి శుభఫలితాలు ఇవ్వనున్నాడు. ఈ సమయంలో శివుడు మరియు విష్ణువును పూజించాలి.
మిథునరాశి (Gemini)- ఆర్ద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశం మిధున రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తాడు. ఆర్థిక పరిస్థితి బల పడుతుంది. ప్రమోషన్-ఇంక్రిమెంట్ పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి. పని ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది. అదృష్ట సహాయంతో అన్ని పనులు పూర్తవుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.
సింహం (Leo)- సూర్యుని రాశిలో మార్పు సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు వేగంగా ప్రారంభమవుతాయి. మీకు పదోన్నతి, ధనం, ప్రతిష్ఠలు లభిస్తాయి. శత్రువులు ఓడిపోతారు. కొత్త ఇల్లు లేదా కారు కొనాలనుకునే వారు ఈ సమయంలో వీటిపై పెట్టుబడి పెట్టవచ్చు.
కన్య రాశి (Virgo)- సూర్యుని రాశిలో మార్పు కన్య రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జూలై 6లోపు వారు కొన్ని శుభవార్తలను వింటారు. ఉద్యోగ-వ్యాపారాలలో విజయం ఉంటుంది. లాభాల శాతం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కనే వారు విజయం సాధిస్తారు.
Also Read; Yamudu Puja tips: జూన్ 23న యముడిని ఎందుకు పూజించాలి? దీని వెనుక ఉన్న ఆసక్తికర కారణం ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.