Fruits In Dream: కలలో ఈ ప్రూట్స్ కనిపిస్తే.. మీ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది!

Fruits In Dream: ప్రతి ఒక్కరూ కలలు కంటారు. అయితే మీ కలలో ప్రూట్స్ కనిపిస్తే శుభ సూచకమనే చెప్పాలి. దానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 09:43 AM IST
Fruits In Dream: కలలో ఈ ప్రూట్స్ కనిపిస్తే.. మీ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది!

Fruits In Dream: నిద్రపోతున్నప్పుడు ప్రతి వ్యక్తి ఏదో ఒక కల కంటాడు. కొన్ని డ్రీమ్స్ గుర్తుంటాయి, మరి కొన్ని మరిచిపోతుంటాం. స్వప్న శాస్త్రం (Swapna Shastra) ప్రకారం, ప్రతి కల భవిష్యత్తు గురించి సూచనను ఇస్తుంది. అదేవిధంగా, మీకు మీ కలలో పండ్లు (Fruits In Dream) కనిపిస్తే.. శుభ సూచకమనే చెప్పాలి. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ద్రాక్ష (grapes): స్వప్న గ్రంథం ప్రకారం, కలలో ద్రాక్షను చూడటం శుభప్రదంగా పరిగణించబడుతుంది. కలలో ద్రాక్ష కనిపించడం బాధలను అంతం చేసే సంకేతం. ఇది మానసిక మరియు శారీరక సమస్యల తొలగింపును సూచిస్తుంది. 

దానిమ్మ (pomegranate): దానిమ్మ పండును కలలో చూడటం శుభసూచకంగా చెబుతారు. ఇదీ కలలో కనిపించిందంటే... మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని మరియు ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుందని అర్థం.

జామ (guavas): కలల గ్రంథం ప్రకారం, మీరు మీ కలలో జామపండును చూసినా లేదా మీరు జామపండును తినడం చూసినా, మీ ప్రేమ జీవితంలో మరింత తీపి ఉంటుందని అర్థం. ప్రేమ వ్యవహారాలు లేని వారు తమ జీవితంలో లవ్ ను ఆహ్వానించడానికి సంకేతంగా భావిస్తారు.

అరటి పండు (bananas): మీకు కలలో అరటిపండ్లు కనిపిస్తే, మీ వైవాహిక జీవితం ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా గడిచిపోతుందని అర్థం. మీరు మీ కలలో అరటిపండు తినడం కనిపిస్తే, అది శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. 

నారింజ (oranges): కలల గ్రంథం ప్రకారం, కలలో నారింజను చూడటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు ప్రమోషన్ పొందడాన్ని సూచిస్తుంది. దీనితో పాటు, మీరు రాబోయే కాలంలో గౌరవం పొందబోతున్నారని తెలుపుతుంది.  

Also Read: Ancestors in Your dream: చనిపోయిన మీ పూర్వీకులు కలలో కనిపిస్తున్నారా? అయితే దానికి కారణం ఇదే..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News