Budh Shukra Rahu Yog: మార్చి 31న మేష రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే ఇక..

Budh Shukra Rahu Yog:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఇవి రాశిని ఛేంజ్ చేయడం వల్ల కొన్ని శుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈనెల చివరిలో బుధుడు, శుక్రుడు మరియు రాహు కలయిక వల్ల అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2023, 04:25 PM IST
Budh Shukra Rahu Yog:  మార్చి 31న మేష రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ 3 రాశులవారు పట్టిందల్లా బంగారమే ఇక..

Budh Shukra Rahu Yog 2023: బుధుడు మార్చి 31న మేషరాశిలో సంచరిస్తాడు. రాహువు మరియు శుక్రుడు అప్పటికే మేషరాశిలో కూర్చుని ఉంటారు. దీంతో మేషరాశిలో రాహు, శుక్ర మరియు బుధ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ  యోగాన్ని జ్యోతిష్యంలో చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. త్రిగ్రాహ యోగం వల్ల ఏయే రాశులవారికి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకుందాం.

త్రిగ్రాహి యోగం ఈ రాశులకు వరం
మేషం
ఈ రాశిలోనే బుధ, శుక్ర, రాహువు గ్రహాల కలయిక జరగబోతుంది. దీంతో మేషరాశివారు భారీగా ప్రయోజనం పొందుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభం పొందుతారు. బిజినెస్ చేసే వారు మంచి లాభాలను గడించడంతోపాటు వ్యాపారాన్ని విస్తరిస్తారు. దాంపత్య జీవితం బాగుంటుంది. పెళ్లి ఫిక్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. 
సింహ రాశి
సింహ రాశి వారికి త్రిగ్రాహి యోగం అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలోనూ అదృష్టం కలిసి వస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. మీరు బిజినెస్ లో పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు. ఉద్యోగం లేదా వ్యాపారం నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 
కర్కాటక రాశి 
ఒకే రాశిలో మూడు గ్రహాల కలయిక కర్కాటక రాశివారి వృత్తి మరియు వ్యాపారాలకు శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం మీ కర్మ స్థానంలో ఏర్పడుతుంది. దీంతో మీ పనిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారుల మంచి లాభాలను గడిస్తారు. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 

Also Read: Vikram Samvat 2080: ఉగాది రోజున 'గజకేసరి యోగం'.. ఈ రాశులకు ఏడాది పొడవునా డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News