Tuesday Remedies: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం ఇలా వ్రతం చేస్తే, ధనవంతులవ్వడం కాయం!

Tuesday Remedies: మంగళ దోషం ఉన్నవారు శుక్లపక్షంలోని మంగళవారం రోజున హనుమంతునికి ఉపవాసాలతో పూజ కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దోషం తీరిపోయి.. ఆర్థిక సమస్యలు కూడా దూరం అవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 22, 2023, 08:31 PM IST
Tuesday Remedies: శుక్లపక్షంలోని మొదటి మంగళవారం ఇలా వ్రతం చేస్తే, ధనవంతులవ్వడం కాయం!

Tuesday Remedies: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి మంగళవారం హనుమంతుని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. హనుమంతుని ఆరాధనతో పాటు ఉపవాసాలు పాటించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి మంగళవారం ఉపవాసం పాటించి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల సులభంగా అప్పుల బాధలు తీరిపోతాయి.

ప్రస్తుతం చాలామంది మంగళ దోషంతో బాధపడుతున్నారు. ఈ దోషం ఉండడం వల్ల తీవ్ర సమస్యలే కాకుండా ఆర్థిక సమస్యలు కూడా వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యలు తొలగిపోవడానికి శుక్లపక్షంలోని మొదటి మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్లి జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెలిపిన విధానాల ప్రకారం పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ పూజ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి నియమాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

మంగళ దోషంతో బాధపడుతున్న వారు తప్పకుండా శుక్లపక్షం తర్వాత వచ్చే మంగళవారం కూడా హనుమంతుడికి ఉపవాసాలతోపాటు పూజా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఇలా 25 నుంచి 45 మంగళవారం దాకా ప్రతి మంగళవారం ఉపవాసం పాటించడం వల్ల సులభంగా దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా మీ దరిదాపుల్లోకి రావని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

హనుమంతుని పూజా క్రమంలో తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటించాలి:
ప్రతి మంగళవారం హనుమంతునికి పూజ చేసే సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఉదయాన్నే నిద్ర లేచి.. తల స్నానం చేయాలి. ఆ తర్వాత హనుమంతునికి ఎంతో ఇష్టమైన సింధూర వర్ణం కలిగిన వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది. ఇలా ధరించిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా హనుమంతుని విగ్రహం ముందు దీపం వెలిగించి.. హనుమాన్ చాలీసా చదువుతూ నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి మంగళవారం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే బాధలన్నీ దూరమవుతాయి.

Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News