Tulsi Vastu: ఇంట్లో రామ తులసిని నాటడం మంచిదా.. కృష్ణ తులసిని నాటడం మంచిదా..?

Tulsi Vastu: తులసి మొక్క భారతీయులు లక్ష్మి దేవతగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కలు ఉంటే సక్ష్యాత్తు మహాలక్ష్మి దేవతయో ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఈ మొక్క ఉంటే.. సానుకూలత అంశాలు, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిషశాస్త్రం పేర్కొంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 11, 2022, 02:42 PM IST
  • ఇంట్లో రెండు రకాల తులసి మొక్కలను నాటొచ్చు
  • రామ తులసి ఇంట్లో ఉంటే చాలా మేలు
  • కృష్ణ తులసిలో ఎన్నో ఔషధ గుణాలు
Tulsi Vastu: ఇంట్లో రామ తులసిని నాటడం మంచిదా.. కృష్ణ తులసిని నాటడం మంచిదా..?

Tulsi Vastu: తులసి మొక్క భారతీయులు లక్ష్మి దేవతగా భావిస్తారు. ఇంట్లో తులసి మొక్కలు ఉంటే సక్ష్యాత్తు మహాలక్ష్మి దేవతయో ఇంట్లో నివసిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఈ మొక్క ఉంటే.. సానుకూలత అంశాలు, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిషశాస్త్రం పేర్కొంది. శుభ రోజుల్లో  ఉదయం, సాయంత్రం పూట తులసి దేవిని పూజించడం వల్ల విష్ణువు, లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారని శాస్త్రం చెబుతోంది. అయితే తులసి దేవిని పూజించే క్రమంలో పలు రకాల నియమాలను పాటించాలని వాస్తు శాస్త్రం, జ్యోతిషశాస్త్రం తెలుపుతోంది. ఈ నియమాలను పాటించడం వల్ల సకాల సుభాలు లభిస్తాయని శాస్త్రం పేర్కొంది.

ఇంట్లో ఏ తులసిని నాటాలి..?

మనం ఇంట్లో నాటే తులసిలో రెండు రకాలుంటాయి. మొదటి రామ తులసి అయితే రెండో తులసిని కృష్ణ తులసిగా పిలుస్తారు. భారతీయులు అందరు ఎక్కువగా ఇళ్లలో రామ తులసిని నాటుతారు. ఇంట్లో ఏ తులసిని నాటాలనుకునే సందిగ్ధంలో ఉన్నవారు తప్పకుండా రామ తులసిని నాటాలని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే రామ తులసి, కృష్ణ తులసిల మధ్య రెండు రకాల వ్యాత్యాసాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రామ తులసి: రామ తులసి ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. అంతేకాదు వీటిని తింటే కొంచెం తియ్యగా ఉంటాయి.  దీనిని శ్రీరాముడికి ప్రీతికరమైనదిగా భావిస్తారు.  ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల కుటుంబంలో  సుఖ సంతోషాలు, శాంతి, సంపదలు చేకూరుతుందని శాస్త్రం భావిస్తోంది.

కృష్ణ తులసి: కృష్ణ తులసిని ఇంట్లో పెంచుకోవడం వల్ల అన్ని రకాల వ్యాధులు దూరమవుతాయని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. అంతేకాకుండా ఈ మొక్క గురించి ఆయుర్వేద శాస్త్రంలో చాలా స్పష్టంగా వివరించారు. ఇందులో అన్ని రకాల ఔషధగుణాలున్నాయి. అన్ని వ్యాధుల నివారణాలకు దీనిని వినియోగించవచ్చని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఈ మొక్క శ్రీకృష్ణుకి ప్రీతికరమైనదిగా శాస్త్రం చెబుతోంది.

తులసి నియమాలు:

1. గురువారం ఇంట్లో తులసిని నాటడం వల్ల సకల శుభాలు జరుగుతాయని శాస్త్రం భావిస్తోంది. అందుకే గురువారం నాటడం చాలా మంచిది.
2. ఈ మొక్కను తూర్పున నాటడం అత్యంత శుభప్రదంగా పరిగణించింది వాస్తు శాస్త్రం. బాల్కనీ లేదా కిటికీ దగ్గర తులసి మొక్కను నాటాలనుకుంటే.. ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నాటడం మేలని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.
3. ఇంట్లో తులసి మొక్కల ఒకటి నుంచి ఐదు నాటొచ్చని శాస్త్రం పేర్కొంది.
4. తులసి మొక్కను నాటిన తర్వాత అక్కడ ఎప్పుడూ మురికిని ఉంచకూడదు. చీపురులు, డస్ట్‌బిన్‌లు మొదలైనవి అస్సులు ఉంచొద్దని శాస్త్రం తెలుపుతుంది.
5. ఏ కాలంలోనైనా తులసి మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Read also: Paratha Recipe: ఉదయాన్నే దీనితో చేసిన పరాటా తింటే.. రోజంతా శరీరం అక్టివే..!

Read also: Heavy Rains: కుండపోత వానలతో తెలంగాణ అతలాకుతలం.. గోదావరిలో ప్రమాదకరంగా నీటిమట్టం

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News