Ugadi Pachadi Recipe: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారుచేయు విధానం, ప్రాముఖ్యత

How To Make Ugadi Pachadi : ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం, పానీయం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి ఈ పర్వదినం నాడు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 13, 2021, 10:05 AM IST
Ugadi Pachadi Recipe: షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి తయారుచేయు విధానం, ప్రాముఖ్యత

Ugadi Pachadi Recipe: ఉగాది.. తెలుగువారి తొలి పండుగ. తెలుగు సంవత్సరాది అని ఉగాదిని వ్యవహరిస్తుంటాం. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్ర శుక్ల పాడ్యమి నాడే బ్రహ్మదేవుడు విశాలమైన సృష్టిని ప్రారంభించారని అందుకే యుగాది(ఉగాది) జరుపుకోవాలని పురాణాలు చెబుతున్నాయి. మీకు, మీ కుటుంబసభ్యులందరికీ శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఉగాది పండుగ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకం, పానీయం షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులతో తయారుచేసే ఉగాది పచ్చడి ఈ పర్వదినం నాడు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. మంచి - చెడు, కష్టం - సుఖం, పాపం -  పుణ్యం ఇలా ఎన్నో అంశాలు జీవితంలో కలిసి ఉంటాయని ఉగాది(Ugadi 2021) పచ్చడి ద్వారా తెలుసుకోవచ్చు.

Also Read: Ugadi 2021 Wishes: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

ఉగాది పచ్చడి తయారు చేయు విధానం:
ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
వేపపూత తగినంత, చెరుకు లేదా మెల్లం ముక్క, సరిపడ చింతపండు, చిన్న కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఒక మిరపకాయ, చిటికెడు ఉప్పు, నీళ్లు కావాలి. కొందరు ఉగాది పచ్చడి తయారు చేసేందుకు అరటిపళ్లు, మామిడి కాయలు, బెల్లం, కొబ్బరి, వేప పువ్వు, చింతపండు, జామకాయలు మొదలగునవి వినియోగిస్తారు.  

తయారీ విధానం: ముందుగా వేపపూతను నీటిలో పోసి కడగాలి. కొబ్బరి, బెల్లం, మిరపకాయ, మామిడికాయను చిన్నచిన్న ముక్కలుగా కట్‌ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. చింతపండును చిన్న గిన్నెలో నానబెట్టి రసాన్ని తీసి ఉంచాలి. ఓ పెద్ద పాత్రలో కావాల్సిన పరిమాణంలో నీటిని తీసుకోవాలి. అందులో బెల్లం, చింతపండు రసం పోసి బాగా కలపాలి. ఆ తర్వాత సగం చెంచా ఉప్పు, కొబ్బరి, మిరప, మామిడికాయ ముక్కలు, అవసరమైతే కొబ్బరిపొడి వేసి బాగా కలపాలి. మీరు కోరుకున్న షడ్రుచుల(6 రుచుల) ఉగాది పచ్చడి తయారవుతుంది.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News