Swati Nakshatra 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్వాతి నక్షత్రంలో జన్మించిన వారంతా తెలివితేటలతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరిని రాహు పాలిస్తాడు కాబట్టి.. నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. ఈ నక్షత్రంలో జన్మించిన ప్రతి ఒక్కరూ స్వయం సమృద్ధి తోపాటు జీవితంలో రొమాంటిక్ గా ఉంటారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్న వారి పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని శాస్త్రంలో పేర్కొన్నారు. ముఖ్యంగా వీరు లక్ష్యాల పట్ల కృతనిశ్చయంతో ఉంటారు. దీంతో ఏ పనిలోనైనా సులభంగా విజయం సాధిస్తారు.
అంతేకాకుండా వీరు స్నేహం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా స్వాతి నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ఇంట్లో వివిధ పనుల్లో నివాగ్నమైపోయి ఉంటారు. అంతేకాకుండా ఇంట్లోనే పనులు చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడతారని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్వాతి నక్షత్రంలో జన్మించిన పురుషులంతా ఎంతో తెలివితేటలను కలిగి ఉంటారు. వీరంతా 25 సంవత్సరాల లోపు మాత్రమే తమ సామర్థ్యాన్ని ఉపయోగిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెక్క పని చేసే వారికి వృత్తిపరంగా చాలా కలిసి వస్తుంది. వీరు వ్యాపారాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇక స్త్రీల విషయానికొస్తే వారు అనుకున్న దానికంటే ఎక్కువగా విజయాలు సాధిస్తారు. వీరికి చదువుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ.. పోటీ పరీక్షల్లో ముందుంటారు.
స్వాతి నక్షత్రం వారి సంబంధాలు:
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి సంబంధాల విషయానికొస్తే.. వీరు ఇతరుల పట్ల గొడవకు దిగేందుకు చాలా ఆలోచిస్తారు. కారణాలుంటేనే తగాదాల జోలికి వెళ్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు కొన్ని పరిస్థితుల్లో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కొనే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మహిళలైతే కుటుంబంతో చాలా అనుబంధాన్ని కలిగి ఉంటారు. వీరికి వైవాహిక జీవితం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్యం:
స్వాతి నక్షత్రంలో జన్మించిన వారి ఆరోగ్యం ఎప్పుడు బాగానే ఉంటుంది. ముఖ్యంగా పురుషులైతే యాక్టీవ్ గా ఉంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక స్త్రీల విషయానికొస్తే.. వీరికి కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నక్షత్రంలో జన్మించిన చాలామందిలో మానసిక సమస్యలతో పాటు గర్భాశయ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా వీరు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook