Seven Horses Painting Vastu: వ్యక్తిగత పురోగతికి, కుటుంబ పురోగతికి వాస్తు శాస్త్రంలో ఎన్నో నియమాలు చెప్పబడ్డాయి. మన ఇల్లు, పరిసరాలు, పని చేసే ప్రదేశాల్లో వాస్తు శాస్త్రాన్ని పాటించినట్లయితే సానుకూల ఫలితాలు పొందవచ్చునని వాస్తు నిపుణులు చెబుతుంటారు. వాస్తు ప్రకారం ఇంట్లో పెయింటింగ్స్ లేదా చిత్ర పటాలను తగిలించే విషయంలోనూ తగిన నియమాలు పాటించాలి. లేదంటే దురదృష్టం వెంటాడుతుంది. చాలామంది తమ ఇళ్లల్లో ఏడు తెల్ల గుర్రాల చిత్రపటాన్ని తగిలిస్తుంటారు. వాస్తు ప్రకారం అది శుభప్రదమా... అశుభమా ఇప్పుడు తెలుసుకుందాం...
శక్తికి చిహ్నం :
వాస్తు శాస్త్రం ప్రకారం ఏడు తెల్ల గుర్రాల పెయింటింగ్ శక్తికి, వేగానికి, విజయానికి సంకేతం. వీటిని శుభప్రదంగా భావిస్తారు. చాలామంది తమ ఇళ్లల్లో, పనిచేసే కార్యాలయాల్లో ఈ చిత్రపటాలను తగిలిస్తారు. లేదా గోడకు ఆ పోస్టర్‌ను అంటిస్తారు. అయితే ఈ చిత్రపటం లేదా పోస్టర్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు వాస్తు శాస్త్రంలో సూచించబడ్డాయి.
ఇంట్లో 7 గుర్రాల పెయింటింగ్... పాటించాల్సిన నియమాలు :
1) ఇంట్లో గుర్రాల పెయింటింగ్‌ను ఉంచినట్లయితే... అందులోని గుర్రాలు తప్పక ఒకే దిశలో వెళ్తున్నవై ఉండాలి. వేర్వేరు దిశల్లో వెళ్లే గుర్రాల పెయింటింగ్స్ ఇంటికి మంచిది కాదు.
2) ఏడు గుర్రాల కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ ఉన్న చిత్రాలను ఎప్పుడూ ఉంచవద్దు. ఒకవేళ అలా చేస్తే వాస్తు దోషాలు కలుగుతాయి.
3) ఒకేచోట కూర్చొని లేదా నిలబడి ఉన్న గుర్రాల చిత్రాలు కూడా ఉంచరాదు. గుర్రాలు కదులుతున్నట్లుగా ఉంటేనే మంచి జరుగుతుంది.
4) వాస్తు ప్రకారం ఇంట్లో ఒంటరిగా ఉన్న గుర్రం పెయింటింగ్ ఉంచవద్దు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన నష్టం జరిగే అవకాశం చాలా ఎక్కువ.
5) గుర్రాలు పరిగెత్తుతున్న చిత్రం శుభప్రదం. అయితే ఈ గుర్రాలు ఏ యుద్ధభూమిలోనూ పరుగెత్తకూడదు. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది.
6) మీరు ఇంట్లో ఏడు గుర్రాల చిత్రాన్ని ఉంచినట్లయితే, వాటి రంగు తెలుపు మాత్రమే ఉండాలి. తెల్ల గుర్రాలను శాంతికి చిహ్నంగా భావిస్తారు.
పైన చెప్పిన వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే తొలగిపోతాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడుతాయి. కుటుంబం అన్నివిధాలా పురోగతి చెందుతుంది.
Also Read: Petrol Diesel Price: స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Also Read: Horoscope Today May 12 2022: రాశి ఫలాలు.. ఆ రాశి వారికి దగ్గరి బంధువు నుంచి శుభవార్త అందుతుంది...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook