Money Plant Vastu Tips: దొంగలించిన మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు! దీని గురించి వాస్తుశాస్త్రం ఏమి చెబుతుంది

Vastu Tips For Money Plant: మనీ ప్లాంట్ డబ్బుకు ప్రతీకగా భావిస్తారు. ఈ మెుక్క ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదు. అయితే మనీ ప్లాంట్ నాటేటప్పుడు కొన్ని  విషయాలు గుర్తుపెట్టుకోవాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2022, 06:46 PM IST
Money Plant Vastu Tips: దొంగలించిన మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే డబ్బే డబ్బు! దీని గురించి వాస్తుశాస్త్రం ఏమి చెబుతుంది

Vastu Tips For Money Plant:  వాస్తు శాస్త్రంలో మనీ ప్లాంట్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మధ్య కాలంలో ఇంటి అలంకరణ కోసం ఈ మనీ ప్లాంట్ (Money Plant)ను విరివిగా ఉపయోగిస్తున్నారు.  మనీ ప్లాంట్ ఏ ఇంట్లో ఉంటే అక్కడ డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అలాగే దీనిని ఇంట్లో పెంచుకోవడం వల్ల వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. అయితే మనీ ప్లాంట్ ను ఇంట్లో ఉంచుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇది మీకు ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. ముఖ్యంగా ఈ మెుక్క ఏ దిశలో ఉంటే మంచిది? ఇది ఎక్కడ నాటితే మంచిది? అనే విషయాలు తెలుసుకోవాలి. 

మనీ ప్లాంట్ ప్రయోజనాలు
>>  మనీ ప్లాంట్ ను ఇంట్లో నాటితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయని వాస్తు నిపుణులు పేర్కొంటారు. 
>> మనీ ప్లాంట్‌ను అగ్నేయ దిశలో నాటితే మంచి ఫలితాలనిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో పాజిటివిటీ ఉండేలా చేస్తుంది. 
>> మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది.  అగ్నేయ దిశకు దేవుడు గణేశుడైతే..ప్రతినిధి శుక్రుడు.  

మనీ ప్లాంట్ ప్రతికూలతలు
>>  మనీ ప్లాంట్ సరైన దిశలో పెట్టకపోతే ఆ వ్యక్తి ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాడు.
>>  మీ మనీ ప్లాంట్‌ను వేరొకరికి ఇస్తే ఆ ఇంటి ఐశ్వర్యాన్ని నాశనం చేస్తుందని నమ్ముతారు. 
>>  మనీ ప్లాంట్‌ను శుక్రుని మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి శుక్రుని యెుక్క శత్రు వృక్షాలను దాని దగ్గర ఉంచకూడదు. ఉదాహరణకు మార్స్, చంద్రుడు మరియు సూర్యుని మొక్క. 

దొంగిలించిన మనీ ప్లాంట్‌ ఇంట్లో ఉంటే..
ఇంట్లో దొంగిలించిన మనీ ప్లాంట్‌ను ఉంచినట్లయితే అది చాలా డబ్బును ఇంట్లోకి తీసుకువస్తుందని  నమ్ముతారు. అయితే వాస్తు నిపుణులు దీనిని ధృవీకరించలేదు. కాబట్టి మనీ ప్లాంట్‌ను దొంగిలించవద్దు. దీనితో పాటు మనీ ప్లాంట్‌ను గాజు సీసాలో పెట్టడం మానుకోండి.

Also Read: Chaturmas 2022 : చాతుర్మాసంలో శివుడి అనుగ్రహం పొందాలంటే.. ఇలా చేయండి! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News