Vastu Tips for Plants: ఆ 5 మొక్కల్ని ఈ దిశల్లో ఉంచుతున్నారా..తస్మాత్ జాగ్రత్త సర్వ నాశనమే

Vastu Tips for Plants: వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చాలా విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది. హిందూమతంలో వాస్తుశాస్త్రానికి అంతటి ప్రాముఖ్యత, మహత్యమున్నాయి. ఏ వస్తువును ఎక్కడ ఉంచాలి, ఎక్కడ ఉంచకూడదనేది కచ్చితంగా పాటించాలంటారు వైద్యులు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 15, 2023, 06:07 AM IST
Vastu Tips for Plants: ఆ 5 మొక్కల్ని ఈ దిశల్లో ఉంచుతున్నారా..తస్మాత్ జాగ్రత్త సర్వ నాశనమే

Vastu Tips for Plants: హిందూ జ్యోతిష్యం ప్రకారం వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇంటికి సంబంధించిన ప్రతి అంశం గురించి వివరణ ఉంది. హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క విషయంలో కొన్ని కచ్చితమైన నియమ నిబంధనలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..ఎందుకంటే తులసి మొక్క విషయంలో వాస్తు ప్రకారం నడవకపోతే అనర్ధాలు జరుగుతాయిట...

హిందూమతంలో తులసి మొక్కకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండే మొక్క ఇది. ఆరోగ్య ప్రయోజనాల సంగతి ఎలా ఉన్నా ఆధ్యాత్మికంగా తులసి మొక్కకు మహత్యముంటుంది. రోజూ క్రమం తప్పకుండా తులసి మొక్కకు పూజలు చేస్తారు. అందుకే వాస్తుశాస్త్రంలో తులసి మొక్కను ఎలా ఏ దిశలో అమర్చాలి, ఎలా ఉండకూడదు, ఉంటే ఏమౌతుందనే వివరాల గురించి ప్రస్తావన ఉంది. తులసి సహా 5 మొక్కల్ని పవిత్రంగా భావిస్తారు. ఈ మొక్కల్ని పొరపాటున కూడా దక్షిణ దిశలో పెంచకూడదంటున్నారు. ఒకవేళ కాదని అలా చేస్తే ఆ ఇంట్లో దివాళా ఉంటుందట.

ఇంటిని అందంగా అలంకరించుకునే క్రమంలో చాలామంది వివిధ రకాల మొక్కలు పెంచుకుంటుంటారు. ఇంటికి అందం రావడమే కాకుండా పచ్చదనం పెరుగుతుంది. అంతేకాదు కొన్ని రకాల మొక్కల్లో ఉండే ఔషధ గుణాల కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా దూరమౌతాయి. వాస్తు ప్రకారం కొన్ని మొక్కల నుంచి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. అయితే ఈ మొక్కలు సరైన దిశలో అమర్చితేనే ఆ లాభాలుంటాయంటోంది వాస్తుశాస్త్రం. సరైన దిశలో లేకపోవడం వల్ల ఆ మొక్కలు ఎండిపోయి..క్రమంగా నెగెటివా్ ఎనర్జీ మొదలై చెడు శక్తులకు ఆ ఇళ్లు ఆవాసమయ్యే ప్రమాదముంది. అందుకే తులసి సహా 5 మొక్కల్ని పొరపాటున కూడా దక్షిణ దిశగా ఉంచకూడదు. ఎందుకంటే దక్షిణ దిశ అంటే మృతు దేవత యమ ధర్మరాజు మార్గంగా భావిస్తారు. ఈ దిశలో మొక్కలు అమర్చడం వల్ల ఇంట్లో అశుభం ప్రభావం పడుతుంది. 

వాస్తు శాస్త్రం చెబుతున్న ఈ ఐదు రకాల మొక్కల్లో మొదటిది షమీ మొక్క. ఈ మొక్కను న్యాయదేవతగా భావించే శని గ్రహానికి ముడిపెడతారు. దీనిని దేవతా మొక్కగా పిలుస్తారు. ఈ మొక్కలో అంతర్గతంగా చాలా గుణాలున్నాయి. అందుకే ఈ మొక్కను పొరపాటున కూడా దక్షిణ దిశలో నాటకూడదు. ఈశాన్యం లేదా తూర్పు దిశలోనే ఈ మొక్కను నాటాలి.

ఇక మరో మొక్క అరటి. అరటి మొక్కను కూడా దక్షిణ దిశల అస్సలుంచకూడదు. ఎందుకంటే ఈ మొక్కలో విష్ణు భగవానుడు ఆవాసముంటాడు. అందుకే చాలామంది ప్రతి గురువారం నాడు ఈ మొక్కకు పూజలు చేస్తారు. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఈ మొక్కను ఇంట్లో ఉంచకూడదు. ఇంటి బయట పెంచాలి. ఈ మొక్కను ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటాలి.

వాస్తుశాస్త్రం ప్రకారం రోజ్‌మెర్రీ మొక్కను దక్షిణ దిశలో పెంచకూడదు. తూర్పు దిశలో పెంచితే చాలా మంచిది . దీనివల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఈ మొక్క ఔషధ మొక్క. ఈ మొక్కను దక్షిణ దిశలో నాటడం వల్ల అంతా అశుభమే జరగవచ్చు.

చాలా మంది ఇళ్లలో అందం కోసం, సెంటిమెంట్ కోసం మనీ ప్లాంట్ మొక్క పెంచుకుంటారు. మనీ ప్లాంట్ మొక్కను నేరుగా శుక్రగ్రహంతో ముడిపెడతారు. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ధన సంపదలు వర్ధిల్లుతాయని అర్ధం. ఈ మొక్కను దక్షిణ దిశలో నాటడం నిషేధం. తూర్పు లేదా ఉత్తర దిశలోనే నాటాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఆ ఇంట్లో లేదా కుటుంబసభ్యులకు ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

ఇక అన్నింటికంటే ముఖ్యమైంది తులసి మొక్క. ఇది కేవలం ఔషద మొక్కే కాకుండా హిందూమతం ప్రకారం పరమ పవిత్రమైన మొక్క. అందుకే ప్రతి హిందువు ఇంట్లో ఈ మొక్క తప్పకుండా ఉండటమే కాకుండా రోజూ పూజలు చేస్తారు. ఎందుకంటే ఈ మొక్కను లక్ష్మీదేవికి ఆవాసంగా భావిస్తారు. ఇంత పవిత్రమైన ఈ మొక్కను పొరపాటున కూడా దక్షిణ దిశలో నాటకూడదని వాస్తుశాస్త్రంలో పదే పదే ప్రస్తావించారు. ఈ మొక్కను ఎప్పుడూ తూర్పు దిశలోనే నాటాల్సి ఉంటుంది.

Also read; Mars Transit 2023: నాలుగు రోజులు ఆగండి, ఈ 5 రాశులపై అపారమైన ధనవర్షం

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook

Trending News