Vat Purnima Vrat 2022: వట్ పూర్ణిమ వ్రతం ఇలా చేయండి.. అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Vat Purnima Vrat 2022: అఖండ సౌభాగ్యం పొందడానికి మహిళలు వట్ పూర్ణిమ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఈ వ్రతం జూన్ 14న వస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 13, 2022, 11:37 AM IST
Vat Purnima Vrat 2022: వట్ పూర్ణిమ వ్రతం ఇలా చేయండి.. అంతులేని సంపదను సొంతం చేసుకోండి!

Vat Purnima Vrat 2022 Shubh Muhurat Puja Vidhi:  ఈ సంవత్సరం వట్ పూర్ణిమ వ్రతం మంగళవారం జూన్ 14, 2022 నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున మహిళలు తమ భర్తల దీర్ఘాయువు కోసం మర్రి చెట్టును పూజిస్తారు. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు మర్రిచెట్టులో నివసిస్తారు. మర్రి చెట్టును పూజించడం లక్ష్మీ దేవిని కూడా సంతోషపరుస్తుంది, కాబట్టి హిందూ మతంలో మర్రి చెట్టు (Banyan tree) చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. 

ఉత్తర భారతదేశంలో దీనిని వట్ సావిత్రి వ్రతం అని, దక్షిణ భారతదేశంలో దీనిని వట్ పూర్ణిమ వ్రతం అని పిలుస్తారు. వట్ పూర్ణిమ వ్రతం రోజున మర్రి చెట్టును పూజించడం వల్ల జీవితంలో ఆనందం మరియు అంతులేని సంపద లభిస్తుంది. ఈ రోజున ఉపవాసం చేయడంతోపాటు నియమానుసారంగా పూజలు చేయడం వల్ల శుభపలితాలు కలుగుతాయి. 

పూజ ముహూర్తం
వట్ పూర్ణిమ వ్రతాన్ని (Vat Purnima Vrat 2022 ) జూన్ 14న జరుపుకుంటారు. పౌర్ణమి తేదీ జూన్ 13, సోమవారం 09:02 నుండి ప్రారంభమై... జూన్ 14 సాయంత్రం 05:21 వరకు ఉంటుంది. జూన్ 14వ తేదీ ఉదయం 11 గంటల నుండి 12:15 వరకు పూజకు అనుకూలమైన సమయంగా పరిగణింపబడుతుంది. వట్ పూర్ణిమ రోజున సధ్య యోగా మరియు శుభ యోగం కూడా ఏర్పడుతున్నాయి. 

పూజా విధానం
వట్ పూర్ణిమ ఉపవాసం పాటించే స్త్రీలు.. తెల్లవారుజామున స్నానం చేసి, ఎరుపు రంగు లేదా ఏదైనా శుభకరమైన రంగు దుస్తులు ధరించాలి. మర్రి చెట్టు కింద సావిత్రి, సత్యవాన్ మరియు యముడి యొక్క మట్టి విగ్రహాలను ప్రతిష్టించండి. వట్ చెట్టు వేర్లుకు నీరు అందించండి. ఆ తర్వాత మోలీ, రోలి, పచ్చి దూది, నానబెట్టిన శెనగలు, పువ్వులు మొదలైన వాటితో పూజించాలి. దీని తరువాత, చెట్టు చుట్టూ పచ్చి పత్తిని 3 రౌండ్లు చుట్టండి. ఈ రోజున సత్యవాన్ సావిత్రి కథను తప్పక వినండి.

Also Read: Good luck tips: వేసవిలో ఈ వస్తువులను గుప్తంగా దానం చేస్తే... అదృష్టం మీ వెంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News