Minister Ponnam Worship Rajanna Temple 2024: తెలంగాణ రాష్ర్టంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రమైనా వేములవాడ రాజన్న క్షేత్రం శివస్మరణతో మార్మోగింది. కార్తీక సోమవారం సందర్భంగా తెలంగాణ, అంద్రప్రదేశ్, మహరాష్ర్టల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే సుప్రభాత సేవ తదనంతరం ఆలయంలోని గో పూజా నిర్వహించి ఆలయ అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెల్లవారే వరకు ముందే అన్ని క్యూ లైన్ లో భక్తులతో నిండిపోయాయి. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో స్వామి వారి గర్భగుడి దర్శనం నలిపివేసి కేవలం లఘు దర్శనం అమలు చేశారు.
తెల్లవారుజామునే ధర్మగుండంలో స్థానమాచారించి ఆలయం ముందు భాగంలో కార్తీక దీపాలు వెలిగించారు. తదనంతరం స్వామివారి దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా వెళ్లి స్వామివారిని దర్శించు కున్నారు. భక్తులు తమ కోరిన కోరికలు నెరవేరాలని శివుడికి వాహనమైనటువంటి కోడె మొక్కు పూజలను చెల్లించారు. అలాగే స్వామి వారి కళ్యాణ కట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. బాలత్రిపురదేవి అమ్మవారి వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. రాజన్న ను మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ , ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు దర్శించుకున్నారు.
స్వామి వారికి గోపూజ నిర్వహించి కోడే మొక్కులు చెల్లించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించమని ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని, ఇది ఎవరి సమాచారాన్ని ఇబ్బంది పెట్టేందుకు కాదని, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైంది కాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక దిక్సూచి అవసరాల కోసం తీసుకుంటున్న సమాచారమన్నారు. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ లకు ఏం చేసిందని అంటున్నారు.
అసలు బీసీ ల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్ బీసీ గురించి మాట్లాడే వరకు ఉండాలంటే మీ పార్టీ అధ్యక్ష పదవి ,కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సి లకు ఒక్కోటి ఇస్తే మీకు బీసీ ల గురించి మాట్లాడే అర్హత ఉంటుందన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీకు మాట్లాడే అర్హత ఎక్కడిదని, రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యలకు ప్రభావితం కావద్దని కోరుతున్నామన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన మీ ఆకాంక్షలకు అనుగుణంగా వచ్చింది... భవిష్యత్ ప్రణాళికలతో ముందుకు పోతున్నామన్నారు...
Also Read: High Bp Health Tips: ఈ టెక్నిక్ తో హై బీపీ నార్మల్ అవుతుంది.. మీరు కూడా పాటించండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.