High Bp Health Tips: ఈ టెక్నిక్ తో హై బీపీ నార్మల్ అవుతుంది.. మీరు కూడా పాటించండి..!

Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు.  ఈ సమస్యను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  తినే ఆహారం  రక్తపోటును తగ్గించడంలో లేదా పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవాలి అనేది తెలుసుకుందాం.   

Written by - Shashi Maheshwarapu | Last Updated : Nov 9, 2024, 10:18 AM IST
 High Bp Health Tips: ఈ టెక్నిక్ తో హై బీపీ నార్మల్ అవుతుంది.. మీరు కూడా పాటించండి..!

Tips To Reduce High BP: బీపీ అంటే అధిక రక్తపోటు. ఇది చాలా మందిని వేధించే సమస్య. ఇందులో కొంతమందిలో హై బీపీ కూడా ఉంటుంది. హై బీపీ అంటే అధిక రక్తపోటు. మన గుండె రక్తాన్ని శరీరమంతటా పంపుతున్నప్పుడు రక్తనాళాల గోడలపై ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని రక్తపోటు అంటారు. ఈ ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని హై బీపీ అంటారు. ఈ సమస్యను నియంత్రించడానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఏం తినాలి, ఏం తినకూడదు అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యం.

హై బీపీ ఎందుకు వస్తుంది? 

కొన్ని కుటుంబాల్లో హై బీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది. లేదంటే  బరువు ఎక్కువగా ఉండటం వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది.  సిగరెట్‌లో ఉండే రసాయనాలు రక్తనాళాలను సన్నగా చేసి, రక్తపోటును పెంచుతాయి. ఉప్పు శరీరంలో నీటిని నిలుపుకుని, రక్తపోటును పెంచుతుంది. వ్యాయామం చేయకపోవడం వల్ల బరువు పెరుగుతుంది రక్తనాళాల ఆరోగ్యం క్షీణిస్తుంది. ఒత్తిడి హార్మోన్లు రక్తపోటును పెంచుతాయి. హై బీపీ వల్ల గుండె, కిడ్నీలు, మెదడు వంటి అవయవాలకు హాని కలిగే ప్రమాదం ఉంటుంది.

హై బీపీ వల్ల కలిగే సమస్యలు:

గుండె జబ్బులు:

గుండెపోటు: హై బీపీ వల్ల గుండెకు రక్తం సరఫరా తగ్గి గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

హార్ట్ ఫెయిల్యూర్: గుండె బలహీనపడి తగినంత రక్తాన్ని పంపలేకపోవడం.

మెదడుకు సంబంధించిన సమస్యలు:

స్ట్రోక్: మెదడుకు రక్తం సరఫరా అంతరాయం కలిగితే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.

మెదడు అనూర్యిజం: మెదడులోని రక్తనాళాలు బలహీనపడి పగిలిపోవడం.

కిడ్నీ వ్యాధి: హై బీపీ కిడ్నీలపై ఒత్తిడి పెంచి కిడ్నీ వ్యాధికి దారితీస్తుంది.

కళ్ళ సమస్యలు: రెటినాకు రక్తం సరఫరా తగ్గి చూపు మందగించడం లేదా అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది.

పెద్దధమనులు వ్యాధి: శరీరంలోని పెద్ద రక్తనాళాలు దెబ్బతిని, పొడుచుకు వచ్చి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది.

బీపీ ఉన్నవారు తీసుకోవాల్సిన పదార్థాలు:

పొటాషియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు  తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తపోటు తగ్గుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. పొటాషియం ఉండే పండ్లు, కూరగాయలు డైట్‌ లో తీసుకోవాలి. ముఖ్యంగా అరటి, అవకాడో, ఆరెంజ్, మేలన్, ఆప్రికాట్స్, ఆకు కూరలు, టమాటో, బంగాళాదుంప, చిలగడ దుంప, పాలు, పెరుగు, నట్స్, గింజలు, బీన్స్, సాల్మన్ చేప ఇందులో పొటాషియం ఉంటుంది.  అలాగే హైబీపీని తగ్గించడంలో మెగ్నీషియం కూడా కీలక ప్రాత పోషిస్తుంది. ఇది ఎక్కువగా పాలకూర, బచ్చలికూర, బ్రౌన్ రైస్, ఓట్స్,  బాదం, గోధుమ వంటి వాటిలో లభిస్తుంది, ఫైబర్‌ ఉన్న ఆహారపదార్థాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.  బ్రౌన్ రైస్, ఓట్స్, బార్లీ,  కంది, తువర, ఆపిల్, పేరుగులో దొరుకుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాలు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, రక్తపోటును తగ్గిస్తుంది.  నిమ్మ, నారింజ, మామిడి, బెల్ పెప్పర్, బ్రోకలీ డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తనాళాలను సడలిస్తాయి.

హై బీపీని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మందులు వాడటం వంటివి చాలా ముఖ్యం. వైద్యుని సలహా మేరకు క్రమం తప్పకుండా బీపీని చెక్ చేయించుకోవడం వైద్యుడు సూచించిన మందులు తీసుకోవడం చాలా ముఖ్యం.

 

Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News