Venus and Mercury: బుధ శుక్ర గ్రహాలు మిధునంలో..ఆ నాలుగు రాశులకు ఊహించని ధనలాభం, జూలై 13 నుంచి

Venus and Mercury: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆషాఢ పౌర్ణిమ రోజు లక్ష్మీ నారాయణుల యోగ నిర్మాణముంటుంది. ఇది చాలా శుభసూచకంగా భావిస్తారు. ఏయే రాశులవారికి ఇది ఉపయోగకరమో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 11, 2022, 03:38 PM IST
Venus and Mercury: బుధ శుక్ర గ్రహాలు మిధునంలో..ఆ నాలుగు రాశులకు ఊహించని ధనలాభం, జూలై 13 నుంచి

Venus and Mercury: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఆషాఢ పౌర్ణిమ రోజు లక్ష్మీ నారాయణుల యోగ నిర్మాణముంటుంది. ఇది చాలా శుభసూచకంగా భావిస్తారు. ఏయే రాశులవారికి ఇది ఉపయోగకరమో పరిశీలిద్దాం..

గ్రహాలు, నక్షత్రాల కదలిక కొన్ని రాశులవారికి శుభసూచకంగా..మరికొన్ని రాశులవారికి అశుభంగా ఉంటుంది. జూలై 13న ఆషాఢ పౌర్ణిమ ఉంది. హిందూమతంలో ఆషాఢ పౌర్ణికకు విశేష ప్రాధాన్యత, మహత్యముంది. ఈ రోజున శుక్రగ్రహం ఉదయం 10 గంటల 41 నిమిషాలకు మిధునరాశిలో ప్రవేశించి..ఆగస్టు 7 వరకూ ఇదే రాశిలో కొనసాగనున్నాడు. అటు జూలై 2న బుధ గ్రహం ఇప్పటికే మిధునరాశిలో ప్రవేశమైంది. జూలై 13న శుక్ర గ్రహం మిధునరాశిలో ప్రవేశిస్తూనే..బుధ, శుక్ర గ్రహాల కలయికతో లక్ష్మీ నారాయణుల యోగం ఏర్పడుతుంది. ఈ క్రమంలో జూలై 13 నుంచి జూలై 16 వరకూ ఉన్న సమయం కొన్ని రాశుల వారికి అంతులేని లాభాల్ని చేకూరుస్తుంది. 

సింహరాశి జూలై 13వ తేదీన శుక్రగ్రహం గోచారం సందర్భంగా ఆ రాశివారికి అంతా శుభమే జరుగుతుంది. ఈ గోచారం కారణంగా ధన ప్రాప్తి లభిస్తుంది. ఈ సందర్బంగా సేవింగ్స్ ఎక్కువగా చేస్తారు. శుక్రగ్రహం గోచారం కారణంగా సింహరాశి జాతకులు విదేశీ యాత్ర చేయవచ్చు. పనిచేసే చోట లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. 

మిధునరాశిలో బుధుడు ముందు నుంచే ఆసీనుడై ఉన్నాడు. జూలై 13న శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా బుధ-శుక్ర గ్రహాల కలయికతో యోగం ఏర్పడుతుంది. ఫలితంగా తులారాశివారికి అధిక ప్రయోజనం చేకూరనుంది. చేసే ప్రతిపని విజయవంతమౌతుంది. లక్ష్మీ నారాయణుని యోగం తుల రాశివారికి చాలా లాభదాయకం. కెరీర్‌పరంగా అదృష్టం లభించవచ్చు. కొత్త అవకాశాలు లభిస్తాయి. కుటుంబం, పిల్లలతో ఆనందంగా ఉంటారు. ధనవంతులయ్యేందుకు ఇది అద్భుత అవకాశం.

కుంభరాశివారికి ఆషాఢ పౌర్ణిమ శుభ ప్రభావం చూపించనుంది. ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారానికి సంబంధించిన వ్యక్తులకు శుభం కలగనుంది. మంచి లాభాలుంటాయి. ఒకవేళ ప్రాపర్టీలో పెట్టుబడులు పెట్టాలనుకుంటే..ఇదే మంచి సమయం. అటు వ్యాపారాలు ప్రారంభించేందుకు కూడా అనువైన సమయం. 

వృశ్చిక రాశి వారికి..బుధ, శుక్ర గ్రహాల కలయిక లాభదాయకంగా ఉంటుంది. ప్రత్యేకించి వ్యాపారవర్గాలకు మంచి సమయమని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వృశ్చికరాశివారి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. లక్ష్మీ నారాయణుని యోగంతో లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలుగుతుంది. 

Also read; Vasudev Dwadashi 2022: ఇవాళ ఈ ఒక్క మంత్రాన్ని జపించండి.. మీ కష్టాలకు చెక్ పెట్టండి!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News