Venus Transit November 2022: ప్రతి గ్రహం నిర్దిష్ట టైం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ సమయంలో ఈ గ్రహాలు కొన్ని శుభ, అశుభ యోగాలను సృష్టిస్తాయి. ఈ గ్రహ సంచారం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. మరో నాలుగు రోజుల్లో అంటే నవంబరు 11న శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అదే రాశిలోకి బుధుడు సంచరించనున్నాడు. వృశ్చికరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం (Lakshminarayana Yogam) ఏర్పడుతుంది. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
తుల (Lirbra): బుధ-శుక్రుల కలయికతో ఏర్పడుతున్న లక్ష్మీనారాయణ యోగం తులరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. జీవితంలో సౌకర్యాలు పెరుగుతాయి.
మకరం (Capricorn): శుక్ర సంచారం మరియు బుధ సంచారం వల్ల ఏర్పడిన లక్ష్మీ నారాయణ రాజయోగం మకరరాశి వారికి లాభాలను ఇస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగుల జీతం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. స్టాక్ మార్కెట్, లాటరీల ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తారు. మీ కోరిక నెరవేరుతుంది. మీరు వ్యాపారంలో పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది.
కుంభం (Aquarius): లక్ష్మీ నారాయణ యోగం కుంభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. మీరు కెరీర్ లో పురోగతిని సాధిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.
Also Read: Dev Diwali 2022: ఇవాళే దేవ్ దీపావళి.. శుభముహూర్తంలో ఈ ఒక్క పని చేయండి చాలు.. మీరు ధనవంతులు అవుతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook