Venus Transit 2024: సూర్యుడి సొంత రాశిలోకి శుక్రుడు.. 3 రాశులవారు కుబేరులు కాబోతున్నారు!

Venus Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు చాలా రోజుల తర్వాత సూర్యుడి సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 26, 2024, 11:11 AM IST
Venus Transit 2024: సూర్యుడి సొంత రాశిలోకి శుక్రుడు.. 3 రాశులవారు కుబేరులు కాబోతున్నారు!

 

Venus Transit 2024: శుక్రుడి సంచారానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో శుభ గ్రహంగా పరిగణిస్తారు. జూలై 7న ఈ శుక్ర గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించింది. ఈ గ్రహం దాదాపు మరో 7 రోజుల పాటు అదే రాశిలో ఉండబోతోంది. ఆ తర్వాత జూలై 31న శుక్రుడు సూర్యుని రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి వారం రోజుల వరకు విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా జరిగిపోతూ ఉంటాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారంతో ఏయే రాశివారికి ఎలా ఉంటుందో? లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేషరాశి:
శుక్రుడు సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి పనుల్లో శ్రమ తగ్గి అనుకున్న లాభాలు పొందగలుగుతారు. దీంతో పాటు కుటుంబ జీవితంలో వాతావరణంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ప్రేమ జీవితం కొనసాగిస్తున్నవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీల నుంచి ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోతుంది. 

మిథున రాశి:
మిథున రాశివారికి కూడా ఈ శుక్రుడి సంచారం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. వీరికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో రొమాన్స్‌ కూడా పెరుగుతుంది. వీరు ఎంతో ఆకర్శనీయంగా ఉంటారు. అలాగే వీరు ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. వీరికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

సింహరాశి:
శుక్రుడి సంచారం సింహ రాశివారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. వీరికి అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో పెట్టబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా వరకు మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. వీరికి ఆధ్యత్మికతపై ఆసక్తి పెరిగి పూజల్లో పాల్గొనే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News