Rama- Krishna Tulsi: హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసిలో అనేక రకాలు ఉన్నాయి.రామ తులసి రాముడికి ప్రీతికరమైనది, అయితే శ్యామ్ తులసి శ్రీ కృష్ణ భగవానుడికి ప్రియమైనది. ఇందులో ఈరోజు మనం రామ,శ్యామ్ తులసి గురించి తెలుసుకుందాం.
హిందూ మతంలో తులసి మొక్కకు చాలా ప్రాముఖ్యత ఉంది. తులసి మొక్క నాటిన ఇంట్లో విష్ణువు ఉంటాడని నమ్ముతారు. తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. తులసిలో రామ, కృష్ణ తులసి అని రెండు రకాలు ఉన్నాయి. ఈ రెండు తులసిలకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది.
ఇదీ చదవండి: Ramlalla Photos: 7 రోజులు 7 రూపాలు.. సుందరమైన బాలరాముని అలంకరణ చిత్రాలు
రామ, కృష్ణ తులసి మధ్య వ్యత్యాసం..
ఈ రెండు తులసిమొక్కలకు వ్యత్యాసం ఏంటంటే.. రామ తులసి ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. కృష్ణ తులసి ఆకులు ముదురు ఆకుపచ్చ లేదా ఊదా రంగులో ఉంటాయి. రామ తులసి ఆకుల రుచి మధురంగా ఉంటుంది, అయితే కృష్ణ తులసి ఆకుల రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది. రామ తులసికి ఘాటైన వాసన ఉంటే, కృష్ణ తులసికి కొంచెం తీపి వాసన ఉంటుంది. తులసి రెండింటిలోనూ ఔషధ గుణాలున్నాయి.
రామ తులసి,కృష్ణ తులసి ప్రాముఖ్యత:
రామ తులసి రాముడికి ప్రీతికరమైనది, అయితే కృష్ణ తులసి శ్రీకృష్ణుడికి ప్రీతికరమైనది. రామ తులసిని పూజలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే కృష్ణ తులసిని ఔషధ ప్రయోజనాల కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంట్లో తులసి రెండు నాటడం శుభప్రదంగా భావిస్తారు. రామ తులసి ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. కృష్ణ తులసి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఆది, ఏకాదశి, గురు, శుక్ర, గ్రహణ రోజులో తులసి మొక్కను తాకకూడదు.
ఇదీ చదవండి: Garuda Puranam: జీవితంలో ఈ 4 పనులు చేసినవారికి మరణానంతరం మోక్షమార్గమేనట..!
రామ తులసిని ఏ దిశలో నాటాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం రామ తులసిని తూర్పు లేదా ఉత్తర దిశలో నాటాలి. దేవతలు ఈ దిశలలో నివసించినట్లు భావిస్తారు. కుబేరుడు ఉత్తర దిశలో ఉంటాడు. తులసిని నాటేటప్పుడు ఈ దిశలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ దిశలలో తులసిని నాటడం వల్ల ఇంటికి సంపదలు చేకూరుతాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook