Yerravaram Narasimha Swamy Temple: భక్తుల కళ్ల ముందే వెలిసిన ఎర్రవరం నరసింహ స్వామి.. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం

Yerravaram Narasimha Swamy Temple History: నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు నేడు భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది. గ్రామంలో ఓ మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహ స్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవ్వరూ నమ్మలేదు. అదే గ్రామంలో 8వ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2023, 03:48 AM IST
Yerravaram Narasimha Swamy Temple: భక్తుల కళ్ల ముందే వెలిసిన ఎర్రవరం నరసింహ స్వామి.. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం

Yerravaram Narasimha Swamy Temple History: స్వయంభుగా వెలసిన దైవ క్షేత్రాలను మనం చరిత్రలో చాలా చదివాము కానీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ తరం వారు చూసిన స్వయంభువుగా వెలిసిన దైవ క్షేత్రం సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహ స్వామి క్షేత్రం. స్వయంభువుగా వెలిసిన కొద్ది రోజుల్లోనే సైన్స్‌కే సవాలు విసురుతూ, భక్తుల కోరికలు తీరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఎర్రవరం బాలా ఉగ్ర నరసింహ స్వామి క్షేత్రంపై స్పెషల్ ఫోకస్ ఈ వార్తా కథనం.

నిన్నటి వరకు మారుమూల పల్లెటూరు నేడు భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుతూ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా మారి వేలాది మంది భక్తులకు బాటగా మారింది. సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠము నుంచి వచ్చి సూర్యాపేట జిల్లా ఎర్రవరం గ్రామంలో వెలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఓ మహిళ ఒంటి మీదకు దేవుడు వచ్చి బాల ఉగ్ర నరసింహ స్వామిని వచ్చానని చెప్తే గ్రామంలో ఎవ్వరూ నమ్మలేదు. అదే గ్రామంలో 8వ తరగతి చదివే బాలుడి ఒంటి మీదకు దేవుడు వచ్చి సాక్షాత్తు బాల ఉగ్ర నరసింహుడు వైకుంఠం నుంచి ఎర్రవరంలో వెలిసినట్టు చెప్పాడు. అలా చెప్పి చెరువు కట్ట దగ్గర ఉన్న దుళ్లగుట్టను తవ్వితే అనవాళ్లు వస్తాయని ఆ బాలుడు రూపంలో స్వామి చెప్పడంతో అతను చూపించిన దగ్గర తవ్వగా బాలుడు చెప్పినట్టుగానే ఆనవాళ్లు కనిపించాయి. అందుకే కళ్ళముందే జరిగిన అనేక సంఘటనలు ఉదాహరణగా చూపిస్తున్నారు. కష్టాలతో వచ్చిన భక్తులను కరుణించి కష్టాల నుంచి బయటపడేసినట్లుగా చెబుతున్నారు. కళ్ళు లేనివారికి చూపు కల్పిస్తూ, కాళ్లు లేని వారికి నడకని తెప్పిస్తూ, మాట రాని వారికి మాటలు తేప్పిస్తూ.. కోరిన కోరికలు నెరవేరుస్తూ తమ కొంగు బంగారం అయ్యాడని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దేవుని దర్శించుకుని తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

సంతానం లేని దంపతులు కోరిన వెంటనే సంతాన ప్రాప్తి కలుగడం ఎర్రవరం నారాసింహుడి ప్రత్యేకత. వివాహమై ఎన్నో ఏళ్లుగా ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆశలు వదులుకున్న సందర్భంలో ఇక్కడ కొబ్బరి కాయలు ముడుపు కట్టి కోరిన వెంటనే సంతానం కలుగుతోందనే పేరు సొంతం చేసుకుంది ఇక్కడి పుణ్యక్షేత్రం. 

ప్రస్తుతం గుడి నిర్మాణంలో ఉన్నందున కొంత అసౌకర్యం కలిగినప్పటికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భగవంతుని దర్శించుకున్నారు. అంతేకాకుండా తమ ఇంటికి, ఒంటికి కలిగిన కష్టాల్ని స్వామివారి మాటల ద్వారా తెలుసుకోగలుగుతున్నారని భక్తులు అంటున్నారు. తను సాక్షాత్తు వైకుంఠం నుంచి వచ్చారని నా దగ్గరికి వచ్చిన భక్తులకు కష్టాలను కడతేరుస్తూ ఆదుకుంటానాని, కలియుగం అంతం కాబోతుందని ఆ సమయంలో ప్రజలను ఆదుకునేందుకు నేనున్నానని ఆ ఉగ్ర బాల నరసింహ స్వామి వారు భక్తులకు హామీ ఇస్తున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట రాష్ట్రమంతా చేరి భక్తులు తండోపతండాలుగా ఎర్రవరం గ్రామం వచ్చి భగవంతుని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

yerravaram-bala-ugra-narasimha-swamy-temple-special-story-yerravaram-narasimha-swamy-temple-history-and-how-it-built.jpg

ఎర్రవరం గ్రామంలో స్వయంభువుగా వెలసిన స్వామి వారికి ఇంకా ఆలయం కూడా నిర్మించలేదు అయినా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మార్చి నెలలో 6 కోట్ల విరాళాలతో ఆలయాన్ని నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. కోదాడ ప్రాంతం ప్రజలు భక్తులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శనానికి తరలివస్తున్నారు. కాగా ప్రతి శుక్రవారం హుండి ఆదాయం పది నుంచి పదిహేను లక్షల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. మార్చిలో జరిగిన శంకుస్థాపన నుంచి నేటి వరకు కేవలం రెండు నెలల్లోనే హుండి ఆదాయం 80 లక్షలు వచ్చినట్లు తెలిపారు. మొదట అనుకున్న దానికి కంటే భక్తులు సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రస్తుతం ఉన్న స్థలం భవిష్యత్తులో సరిపోదని ఆలోచనతో ఏడు నుండి 10 ఎకరాల స్థలాన్ని కొనేందుకు గ్రామస్తులు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.

స్వామి వారు స్వయంభువుగా వెలసిన ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన గ్రామానికి చెందిన 12 ఏళ్ల పిల్లవాడు పండు స్వామి. పండు స్వామి హుజూర్ నగర్ లోని గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ లో ఉన్న పండు స్వామిని ఆవహించిన ఉగ్ర నరసింహ స్వామి తాను గ్రామంలోని దూల్ల గుట్టపై స్వయంభుగా 12 శిరస్సులు గల సర్పం అవతారంలో వెలసినట్లు వాక్కు పలికాడు. దీంతో గ్రామస్తులు మొదట నమ్మకం లేకపోయినా బాలుడి ఉగ్ర రూపాన్ని చూసి గుట్టపై తవ్వగా.. పండు స్వామి చెప్పినట్లుగా మార్చి నెలలో స్వామి వారి అవతారం వెలుగు చూసింది. ఆనాటి నుండి నేటి వరకు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ అద్వితీయంగా వెలుగొందుతోంది. తమ కూమరుడిని ఆవహించి వైకుంఠం నుండి నర్సింహ స్వామి స్వయంభువుగా వెలవడం తమ అదృష్టం అంటున్నారు పండు స్వామి తల్లిదండ్రులు.

Trending News