KL Rahul And Athiya Shetty Getting Married Soon: బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టి, టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అవుననే వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. చాలా కాలంగా రిలేషన్షిప్లో (athiya shetty kl rahul relationship) ఉన్న ఈ జంట ఈ ఏడాది శీతకాలం సీజన్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. వీరు దక్షిణ భారత వివాహ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోనున్నట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది.
'ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహం వారి ఇరువురి తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. 2022 ఏడాది ముగిసేలోపు వారు పెళ్లి చేసుకోవచ్చు.' అని శెట్టి కుటుంబ సన్నిహితులు చెప్పినట్లు ఆ వెబ్సైట్ పేర్కొంది. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి (Athiya Shetty).
దక్షిణ భారతీయుడైన సునీల్ శెట్టి ముల్కిలోని మంగళూరుకు చెందిన తుళు మాట్లాడే కుటుంబంలో జన్మించాడు. కేఎల్ రాహుల్ కూడా మంగళూరుకు చెందినవాడే. అందుకే అతియా శెట్టి, కేఎల్ రాహుల్ వివాహ వేడుకను సౌత్ ఇండియన్ వెడ్డింగ్ స్టైల్లో జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ ( Lucknow Super Giants) కెప్టెన్ గా వ్యవహారిస్తున్నాడు.
Also Read: Maria Sharapova Pic: తల్లి కాబోతున్న అందాల టెన్నిస్ తార మరియా షరపోవా, బేబీ బంప్ ఫోటో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook