Board of Control for Cricket in India: ప్రపంచంలోనే అత్యధిక సంపన్న క్రికెట్ బోర్డు బీసీసీఐ మరోసారి.. క్రికెట్ ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (FY18-FY22) రూ.27,411 కోట్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. క్రికెట్ రెగ్యులేటరీ బాడీకి మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్‌లు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి వచ్చే ఆదాయ షేర్ల ద్వారా వచ్చే బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరిందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రీడా బోర్డుల్లో బీసీసీఐ రెండో స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వానికి తెలియదా..? అని శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) ఎంపీ అనిల్ దేశాయ్ ప్రశ్నించారు. గత ఐదేళ్లలో బీసీసీఐ ఆదాయం, ఖర్చులు, పన్ను వివరాలను వెల్లడించాలని ప్రభుత్వాన్ని కోరారు.
దీంతో రాజ్యసభలో కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు. మీడియా హక్కులు, స్పాన్సర్‌షిప్, ఐసీసీ రెవెన్యూ షేర్ల ద్వారా బీసీసీఐకి రూ.27 వేల కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్థల ఆర్థిక స్థితికి సంబంధించిన డేటాను ప్రభుత్వం నిర్వహించడం లేదన్నారు. బీసీసీఐ డేటాను మాత్రమే తాను పంచుకుంటానని చెప్పారు. 2021–2022 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ రూ.1,159 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించిందని వెల్లడించారు.
"2020-21 ఆర్థిక సంవత్సరంలో బీసీసీఐ రూ.844.92 కోట్ల ఆదాయపు పన్నును చెల్లించింది. 2019-20లో చెల్లించిన రూ.882.29 కోట్ల కంటే కొంచెం తక్కువ. 2019 ఆర్థిక సంవత్సరంలో బోర్డు రూ.815.08 కోట్లను పన్నుగా చెల్లించింది. 2017-18లో చెల్లించిన రూ.596.63 కోట్ల కంటే ఎక్కువ.." అని కేంద్ర మంత్రి తెలిపారు. 2021–2022 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ రూ.7,606 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా.. దాని ఖర్చు దాదాపు రూ.3,064 కోట్లు అని తెలిపారు. 2020–21లో బోర్డు ఆదాయం రూ.4,735 కోట్లు కాగా.. ఖర్చులు రూ.3,080 కోట్లుగా ఉందన్నారు. బీసీసీఐ గత ఐదేళ్లలో మొత్తం 4298 కోట్ల రూపాయలు ట్యాక్స్‌గా చెల్లించందన్నారు. ఈ ఐదేళ్లలో బీసీసీఐ రూ.15,170 కోట్ల వ్యయాన్ని చూపిందని పేర్కొన్నారు.
ఐపీఎల్, భారత క్రికెట్ మీడియా హక్కుల ధరలు పెరగడంతో బీసీసీఐ మరింత ఆదాయం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మరింత ఆదాయం రానుంది. డిస్నీ స్టార్, వయాకామ్ 18తో ఐదేళ్లపాటు రూ.48,390 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు మరింత పెరగనున్నాయి. ఐదేళ్లపాటు ఐపీఎల్ మీడియా హక్కులతో పాటు మరికొన్ని డీల్స్ కూడా ఉన్నాయి.
Also Read: RBI Penalty On Banks: ఈ నాలుగు బ్యాంకులకు షాకిచ్చిన ఆర్‌బీఐ.. ఇందులో మీకు అకౌంట్ ఉందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి