బీసీసీఐపై కాసుల వర్షం..తొలిరోజే రూ.4,442 కోట్లు..!

బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురవబోతోంది.

Last Updated : Apr 5, 2018, 08:50 AM IST
బీసీసీఐపై కాసుల వర్షం..తొలిరోజే రూ.4,442 కోట్లు..!

బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురవబోతోంది. టీమిండియా రాబోయే ఐదేళ్లలో ఆడబోయే మ్యాచ్‌ల కోసం మీడియా హక్కుల్ని అమ్మేందుకు ఈ-వేలం నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు సాగే ఈ వేలం మంగళవారం ఆరంభమైంది. తొలి రోజు అత్యధికంగా రూ.4, 442 కోట్లకు బిడ్‌ దాఖలైంది. వచ్చే ఐదేళ్లలో టీమిండియా ఆడబోయే 102 మ్యాచ్‌ల ప్రసార, ఇతర మీడియా హక్కుల కోసం బీసీసీఐ ఈ వేలం నిర్వహిస్తోంది. స్టార్‌ స్పోర్ట్స్‌, సోనీ, జియో, ఫేస్‌బుక్‌, గూగుల్‌, యుప్ టీవీ లాంటి సంస్థలు కూడా పోటీలో ఉన్నాయి.

తొలిరోజు మంగళ వారం గ్లోబల్‌ కన్సాలిడేటెడ్‌ హక్కు (జీసీఆర్‌)ల కోసం జరిగిన వేలంలో సోనీ, స్టార్‌స్పోర్ట్స్‌, జియోల మధ్య పోటీ ఏర్పడింది. ఈ మూడు సంస్థలు స్టార్, సోనీ, జియోలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా, 2012లో స్టార్‌ స్పోర్ట్స్‌ దక్కించుకున్న మొత్తం (రూ.3851 కోట్లు) కంటే ఇప్పటికే 15 శాతం ఎక్కువ నమోదు కావడం విశేషం. దాంతో బీసీసీఐ ఆశించినట్లుగా అతి భారీ మొత్తానికి హక్కులు అమ్ముడుపోయే అవకాశం కనిపిస్తోంది.

ఈ–వేలంలో జీసీఆర్‌ ముందుగా రూ.4,176 కోట్లతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇది 25 శాతం పెరుగుతూ పోయింది. 4,244 కోట్లు... 4,303 కోట్లు... 4328.25 కోట్లు... ఇలా వేలంలో హక్కుల కోసం మూడు సంస్థలు పోటీ పడ్డాయి. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు ఈ–వేలం జరిగింది.  బుధవారం ఉదయం 11 గంటల నుంచి  ఈవేలం కొనసాగనుంది.

 

Trending News