కరోనా దెబ్బకు BCCI ఆఫీసు వెలవెల!

నిత్యం ఎన్నో క్రికెట్ కార్యక్రమాలు, మీటింగ్‌లతో బిజీగా ఉండే బీసీసీఐ కేంద్ర కార్యాలయం కరోనా వైరస్ కారణంగా వెలవెలబోతోంది.

Last Updated : Mar 18, 2020, 07:47 AM IST
కరోనా దెబ్బకు BCCI ఆఫీసు వెలవెల!

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది.  కోవిడ్-19 (COVID-19) వైరస్ ఆందోళనల నేపథ్యంలో ఇటీవల దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ రద్దు చేసిన బీసీసీఐ అనంతరం ఐపీఎల్ 13వ సీజన్‌ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ముంబైలోని బీసీసీఐ ఆఫీసుకు మంగళవారం తాళం పడింది. ఉద్యోగులను ఇంటి వద్ద నుంచే పనిచేయాలని (వర్క్ ఫ్రమ్ హోమ్) బోర్డు నిర్ణయించింది.

Also Read: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్ వాయిదా

క్రికెట్ మ్యాచ్‌లు, ఇతరత్రా నిర్వహణ సంబంధిత క్రియాశీలక నిర్ణయాలు ఇప్పట్లో తీసుకోకూడదని అధికారులకు బోర్డు సూచించినట్లు సమాచారం. దీనిపై ఓ అధికారి పీటీఐతో మాట్లాడారు. బోర్డు ఆదేశాల మేరకు బీసీసీఐ ఉద్యోగులందరూ ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై వాంఖడే స్టేడియం వద్ద ఉన్న బోర్డు ప్రధాన కార్యాలయం బోసి పోయి కనిపించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

నాభి అందాలతో వర్మ హీరోయిన్ రచ్చరచ్చ!

కాగా, ప్రపంచ వ్యాప్తంగా వేలకు పైగా కరోనా వైరస్ కారణంగా మరణాలు సంభవించగా, దాదాపు 2 లక్షల మంది కరోనా పాజిటీవ్‌గా తేలిన పేషెంట్లు చికిత్స తీసుకుంటున్నారు. భారత్‌లో ఇప్పటివరకూ కరోనా బారిన పడి ముగ్గురు చనిపోయారు. తాజా మరణం మంగళవారం నమోదైనట్లు సమాచారం.  చైనాలో కరోనా మరణాలు తగ్గుముఖం పట్టగా, ఇటలీ, స్పెయిన్‌లలో కరోనా పాజిటీవ్ కేసులతో పాటు మరణాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం గమనార్హం.

Photos: అదిరేటి డ్రెస్సు మీరేస్తే దడ

కరోనా కథనాల కోసం క్లిక్ చేయండి
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News