ఐపిఎల్ 2020 (IPL 2020)ని సస్పెండ్ చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అవును... కరోనావైరస్ విజృంభిస్తున్న (coronavirus threat) ప్రస్తుత తరుణంలో ఐపిఎల్ నిర్వహించడం కష్టమేనని అందరూ భావించారు. అదే సమయంలో ఢిల్లీలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించేది లేదని ఢిల్లీ ప్రభుత్వం సైతం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అందరూ ఊహించినట్టుగానే బీసీసీఐ (BCCI) కూడా ఐపిఎల్ 2020ని సస్పెండ్ వేస్తున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్ 15 వరకు ఐపిఎల్ టోర్నమెంట్‌ని వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ తేల్చిచెప్పింది. ఈ మేరకు బీసీసీఐ నుంచి ఓ అధికారిక ప్రకటన వెలువడింది. ఐపిఎల్ వాయిదా నిర్ణయంపై బీసీసీఐ కార్యదర్శి జే షా స్పందిస్తూ.. ఆటగాళ్లు, క్రికెట్ ప్రియులతో సహా టోర్నమెంట్‌తో ముడిపడి ఉన్న వాళ్లందరి క్షేమం కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
Read also : కరోనా వైరస్ మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి
చైనాలో మొదలైన కరోనావైరస్ ఇప్పటివరకు 116 దేశాలకు వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 1,30,000 మంది కరోనా బారినపడ్డారు. ఐపిల్ టోర్నమెంట్‌లో వివిధ దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొనాల్సి ఉండటం ఒక రిస్క్ అయితే, మరోవైపు ఇమ్మిగ్రేషన్ విషయంలో వీసా రూల్స్ కఠినతరం కావడం వంటివి ఈ నిర్ణయానికి మరో కారణమయ్యాయని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..