Big Bash League: లాస్ట్‌ బాల్‌కు ముందు అలాంటి నిర్ణయమా! హాట్‌ టాపిక్‌గా మారిన డెసిషన్‌

BBL League, Weird last-ball tactic: బిగ్‌బాష్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.. లాస్ట్‌ బాల్‌కు ముందు సిడ్నీ సిక్సర్స్‌ జట్టు తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. అసలు ఏం జరిగిందో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2022, 05:03 PM IST
  • ఫైనల్ స్టేజ్‌కు చేరిన ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌ లీగ్‌
  • ఫైనల్‌ బెర్త్‌ కోసం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌.. సిడ్నీ సిక్సర్స్‌ జట్ల మధ్య పోటీ
  • ఈ మ్యాచ్‌లో లాస్ట్‌ బాల్‌కు ముందు సిడ్నీ సిక్సర్స్‌ జట్టు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశం
Big Bash League: లాస్ట్‌ బాల్‌కు ముందు అలాంటి నిర్ణయమా! హాట్‌ టాపిక్‌గా మారిన డెసిషన్‌

Big Bash League: క్రికెట్‌లో అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ ఇన్సిడెంట్స్‌ జరుగుతుంటాయి. అవి చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఘటనే తాజాగా ఒకటి చోటు చేసుకొంది. ఆస్ట్రేలియాలో నిర్వహించే బిగ్‌బాష్‌ లీగ్‌ ఫైనల్ స్టేజ్‌కు చేరింది. ప్లేఆఫ్స్‌లో బుధవారం అడిలైడ్‌ స్ట్రైకర్స్‌.. (Adelaide Strikers) సిడ్నీ సిక్సర్స్‌ జట్లు ఫైనల్‌ బెర్త్‌ కోసం పోటీపడ్డాయి. 

ఇక ఈ మ్యాచ్‌లో లాస్ట్‌ బాల్‌కు ముందు సిడ్నీ సిక్సర్స్‌ జట్టు ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. బిగ్‌బాష్‌లో (Big Bash League) ఫైనల్‌కు చేరాలంటే ఈ మ్యాచ్‌ చివరి బాల్‌కు సిడ్నీ జట్టు రెండు పరుగులు చేయాల్సి ఉంది. అయితే అప్పటికే ఓపెనర్‌ హేడెన్‌ కెర్ర్‌ (94), జోర్డాన్‌ సిల్క్‌ (1) రన్స్‌తో క్రీజులో ఉన్నారు. 

కాగా హేడెన్‌ లాస్ట్‌ బాల్‌ను ఎదుర్కోవాల్సి ఉండగా నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న జోర్డాన్‌ను ఆ జట్టు రిటైర్డ్‌ హార్ట్‌గా వెనక్కి పిలిచింది. అతడికి బదులు జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్‌కు పంపింది. లెంటన్‌ సిడ్నీ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నారు. జట్టులో పలువురికి కరోనా (Corona) సోకడం వల్ల అక్కడి నియమాల ప్రకారం లెంటన్‌ను ఆడించింది సిడ్నీ జట్టు. మొత్తానికి హేడెన్‌ బౌండరీ సాధించి జట్టుకు విజయం చేకూర్చాడు.

అయితే.. చివరి బాల్‌కు సిడ్నీ జట్టు (Sydney Sixers) అలా బ్యాట్స్‌మన్‌ను మార్చడంతో ఇప్పుడు చర్చనీయాశంగా మారింది. కాగా క్రికెట్‌ నిబంధనల మేరకే తాము ప్రవర్తించామంటూ సిడ్నీ జట్టు చెబుతోంది. అయితే అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ క్రికెట్‌ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

 

Also Read: Mahesh Bank: సైబర్ దాడి కేసులో పోలీసుల చేతికి కీలక ఆధారాలు.. అదుపులో నిందితుడు

గాయంతో ఇబ్బంది పడే ఆటగాడిని మార్చడం నిబంధనల ప్రకారమే అయినా అది క్రీడాస్ఫూర్తికి తగినట్లుగా లేదు అంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మార్క్‌వా అభిప్రాయపడ్డాడు. కాగా.. అంతకుముందు కూడా సిడ్నీ జట్టు ప్లేఆఫ్స్‌లో స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ను ఆడించాలనుకుంది. కాగా అది అక్కడి క్రికెట్‌ (Cricket‌) నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది సిడ్నీ జట్టు. ఇక ఇప్పుడు చాలా మంది సిడ్నీ జట్టు తీరును తప్పుపడుతున్నారు.

Also Read: DCGI Permits Covid Vaccines: కొవాగ్జిన్, కోవిషీల్డ్ బహిరంగ విక్రయానికి డీసీజీఐ అనుమతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News