శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్ చాహల్ తన మణికట్టు మాయాజాలంతో ప్రేక్షకులను అలరించాడు. 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన చాహల్ రియల్ బౌలింగ్ హీరో అనిపించుకున్నాడు. ఈ సిరీస్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ శుభారంభమే చేసింది.
20 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ లోకేశ్ రాహుల్ (48 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్), ధోనీ (22 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వరదతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 16 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. ఉపుల్ తరంగ (16 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్సర్లు) తప్ప మిగతావారెవరూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. భారత స్పిన్నర్ చాహల్ 4 వికెట్లతో లంక పతనానికి దోహదపడ్డాడు.