Australia Women beat India Women in CWG 2022 1st Match: ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత మహిళల జట్టుకు షాక్ తగిలింది. కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో హర్మన్‌ప్రీత్ సేన ఓటమిపాలైంది. భారత్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆష్లీ గార్డ్నర్ (52 నాటౌట్; 35 బంతుల్లో 9x4), గ్రేస్ హారిస్ (37; 20 బంతుల్లో 5x4, 2x6) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కామన్‌వెల్త్ గేమ్స్‌లో మొట్ట మొదటిసారిగా జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు ఓడిపోయారు.
ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగుల పోరాడే స్కోర్ చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (52; 34 బంతుల్లో 8x4, 1x6), షఫాలీ వర్మ (48; 33 బంతుల్లో 9x4) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. స్మృతి మంధాన (24) పరుగులు చేయగా.. యాస్తిక భాటియా (8), రోడ్రిగ్స్ (11), దీప్తి శర్మ (1) విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు సాధించింది.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో భారత యువ పేసర్ రేణుక సింగ్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బకొట్టింది. దాంతో 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏఈ సమయంలో ఆష్లీ గార్డనర్, గ్రేస్ హ్యారీస్ భారత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీల వర్షం కురిపిస్తూ లక్ష్యం దిశగా నడిపించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు.
That's that from our first game at #CWG2022
Australia win by 3 wickets.#TeamIndia will look to bounce back in the next game.
Scorecard - https://t.co/cuQZ7NHmpB #AUSvIND #B2022 pic.twitter.com/p1sn3xS6kj
— BCCI Women (@BCCIWomen) July 29, 2022
గ్రేస్ హారిస్, జెస్ జొనసేన్ పెవిలియన్ చేరినా ఆష్లీ గార్డనర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే గార్డనర్ హాఫ్ సెంచరీ చేసింది. అలానా కింగ్ (18) అండతో చివరి వరకు క్రీజులో నిలిచిన గార్డనర్.. ఆస్ట్రేలియాకు అద్భుత విజయాన్ని అందించింది. దాంతో ఆరంభంలో విజయం ఖాయం అనుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న దాయాది పాకిస్తాన్ జట్టుతో తలపడనుంది.
Also Read: Bipasha Basu Pregnent: తల్లి కాబోతున్న బాలీవుడ్ భామ.. అందుకే దూరంగా?
Also Read: Sanju Samson India: నక్క తోక తొక్కిన సంజూ శాంసన్.. అనూహ్యంగా భారత టీ20 జట్టులో చోటు
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook