Racist comments on Indian fans at Edgbaston during IND vs ENG Test: క్రికెట్ బోర్డులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా జాతి వివక్ష వ్యాఖ్యలు మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ అభిమానుల నోటికి హద్దుహదుపు లేకుండా పోతుంది. రాయలేని, చెప్పకూడని మాటలతో దూషిస్తున్నారు. తాజాగా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదవ టెస్టు నాలుగవ రోజున భారతీయ క్రికెట్ అభిమానులపై ఇంగీష్ ఫాన్స్ జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్‌ను టార్గెట్ చేస్తూ నానా బూతులు తిట్టారు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రీషెడ్యూల్డ్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ భారీ లక్ష్యాన్ని నిర్ధేశించగా.. ఇంగ్లండ్ విజయం దిశగా వెళుతోంది. అయితే ఈ మ్యాచ్ వీక్షించేందుకు మైదానంకు వచ్చిన భారత అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. నాలుగో రోజు ఆట కొనసాగుతున్న సమయంలో కొంతమంది ఇంగ్లీష్ ఫాన్స్ కావాలనే భారత అభిమానులను ఉద్దేశించి జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర రీతిలో వారిని దూషించారు. ఈ విషయాన్ని ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
'ఎడ్జ్‌బాస్టన్‌లోని ఎరిక్ హోల్లీస్ బ్లాక్ నెంబర్ 22లో భారత అభిమానులు జాతి వివక్షను ఎదుర్కొన్నారు. చాలా మంది ఇంగ్లండ్ ఫాన్స్ మమ్మల్ని చెప్పుకోలేని మాటలతో దూషించారు. కర్రె.., పాకీ బాస్టర్డ్స్ అంటూ అవమానపరిచారు. ఈ విషయాన్ని మైదానంలో ఉన్న భద్రతా సిబ్బందికి చెప్పినా స్పందించలేదు. ఒకటి కాదు రెండు కాదు 10 సార్లు ఫిర్యాదు చేసినా, నిందితులను చూపించినా వారు పట్టించుకోలేదు' అని ఓ అభిమాని తన ట్వీటులో పేర్కొన్నాడు. భారత్ ఆర్మీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
Racist behaviour at @Edgbaston towards Indian fans in block 22 Eric Hollies. People calling us Curry C**ts and paki bas****s. We reported it to the stewards and showed them the culprits at least 10 times but no response and all we were told is to sit in our seats. @ECB_cricket pic.twitter.com/GJPFqbjIbz
— Lacabamayang!!!!!!! (@AnilSehmi) July 4, 2022
ఈ ఘటనపై స్పందించిన ఆలస్యంగా స్పందించిన ఈసీబీ.. భారత అభిమానులకు క్షమాపణలు చెపుతూ ఓ ట్వీట్ చేసింది. జాతి వివక్ష ప్రదర్శిస్తూ అసభ్య పదజాలం వాడినట్లు మా దృష్టికి వచ్చిందని, ఇందుకు తాము చింతిస్తున్నామంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొంది. నిందితులను కఠినంగా శిక్షిస్తామని కూడా ఈసీబీ చెప్పింది. క్రికెట్‌లో జాతి వివక్షకు తావు లేదని చెప్పుకొచ్చింది.
Also Read: R Narayana Murthy Mother Death: ఆర్ నారాయణమూర్తికి మాతృవియోగం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook