Livingstone: పసికూన నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. ఒకే ఓవర్‌లో 32 పరుగులు బాదిన లివింగ్‌స్టోన్..

Livingstone Hard Hitting: వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ కొత్త చరిత్ర సృష్టించింది. నెదర్లాండ్స్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 498 పరుగుల భారీ స్కోర్ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 19, 2022, 01:12 PM IST
  • ఇంగ్లాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ వన్డే సిరీస్
  • తొలి వన్డేలో నెదర్లాండ్స్‌ను చితక్కొట్టిన ఇంగ్లాండ్
  • 498 పరుగులు చేసిన ఇంగ్లాండ్ జట్టు
  • ఒకే ఓవర్‌లో 32 పరుగులు బాదిన లివింగ్‌స్టోన్
 Livingstone: పసికూన నెదర్లాండ్స్‌కు చుక్కలు చూపించిన ఇంగ్లాండ్.. ఒకే ఓవర్‌లో 32 పరుగులు బాదిన లివింగ్‌స్టోన్..

Livingstone Hard Hitting: క్రికెట్ పసికూన నెదర్లాండ్స్‌కు ఇంగ్లాండ్ చుక్కలు చూపించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నెదర్లాండ్స్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. బ్యాట్స్‌మెన్ వీర బాదుడికి వన్డేల్లో ఇంగ్లాండ్ కొత్త చరిత్ర సృష్టించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 26 సిక్సులు, 36 ఫోర్లు ఉన్నాయి.అంటే కేవలం బౌండరీల ద్వారానే ఆ జట్టు 300 స్కోర్ సాధించగలిగింది. ఇదే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మ్యాన్ లివింగ్‌స్టోన్ బ్యాట్‌తో తన ప్రతాపం చూపించాడు.

ఫిలిప్ బోయిస్సే వేసిన ఓవర్‌లో లివింగ్‌స్టోన్ ఏకంగా 32 పరుగులు బాదాడు. ఇందులో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మొదటి బంతిని స్క్వేర్ లెగ్‌ మీదుగా సిక్స్‌గా మలిచిన లివింగ్‌స్టోన్ ఆ తర్వాత డీప్ మిడ్ వికెట్ మీదుగా, స్ట్రెయిట్‌ డౌన్‌గా మరో మూడు సిక్సులు బాదాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించిన లివింగ్‌స్టోన్ కేవలం 17 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 22 బంతుల్లో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ స్ట్రైక్ రేటు 300 కావడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్, డేవిడ్ మలన్, జోస్ బట్లర్ సెంచరీలు బాదారు. మొత్తంగా 50 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 498 పరుగులు చేసింది.గతంలో వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇంగ్లాండ్ పేరిటే ఉంది. నాలుగేళ్ల క్రితం ఓ వన్డే మ్యాచ్‌లో ఆ జట్టు ఆస్ట్రేలియాపై అత్యధికంగా 481 పరుగులు చేసింది. ఇప్పుడు నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ స్కోరుతో తమ రికార్డును తామే బద్దలుకొట్టుకున్నట్లయింది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 50 ఓవర్లలో కేవలం 266 పరుగులకే కుప్పకూలింది. దీంతో 232 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో 1-0తో ఇంగ్లాండ్ లీడ్‌లో ఉంది.

Also Read: Actor Murderd : యువ నటుడి దారుణ హత్య.. భార్య మరణించిన నెలల వ్యవధిలోనే?

Also Read: Telangana Jobs: తెలంగాణలో కొలువుల జాతర.. మరో 931 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News