England: క్రికెట్ అంటేనే అద్భుతాలు జరిగే ఆట. అందుకే క్రికెట్‌లో ప్రతిభతో పాటు అదృష్ణం తప్పనిసరి. ఏ బంతి ఎటు నుంచి వస్తుందో అర్ధం కాదు. అర్ధమయ్యేలోగా వికెట్ పోతుంది. అదే జరిగింది ఇంగ్లండ్-వెస్టిండీస్ మ్యాచ్‌లో.
క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలియదు. అందుకే చివరి బంతి వరకూ, చివరి బాల్ వరకూ పోరాడాల్సిందే. కొన్ని బాల్స్ ఎటునుంచి ఎటు వచ్చాయో అర్ధం కాదు. తీరా అర్దమయ్యేలోగా వికెట్ పోతుంది. రెప్పపాటులో బౌండరీకు దూసుకుపోయే బాల్స్ చాలా ఉంటాయి. వెస్టిండీస్-ఇంగ్లండ్ మద్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అవుటైన విధానం అతనికే కాదు..చూస్తున్న ప్రేక్షకులకు కూడా షాక్ ఇస్తుంది.
వెస్టిండీస్ బౌలర్ కీమర్ రోచ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ వేస్తున్నాడు. కీమర్ రోచ్ వేసిన బంతిని ఇంకా ఆడనే లేదు. ఆడేందుకు అంచనా వేస్తుండగా..రెప్పపాటులో దూసుకొచ్చి..వికెట్ ఎగురేసుకుపోయింది. వాస్తవానికి తొలిబంతికే అవుటయ్యే పరిస్థితి ఎదురైనా..తృటిలో తప్పించుకున్నాడు. కానీ ఆ తరువాత కొద్దిసేపటికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అది కూడా ఊహించని విధంగా..రెప్పపాటులో అంతా జరిగిపోయింది. బాల్ కోసం నిరీక్షించేలోగా వికెట్ పడిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్..తొలిరోజు ఆట ముగిసేసరికి..86 ఓవర్లలో ఆరు వికెట్ నష్టానికి 268 పరుగులు సాధించింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో సూపర్ సెంచరీ చేయగా..బెన్‌ఫోక్స్ 42 పరుగులకు వెనుదిరిగాడు. జో రూట్ అనూహ్యంగా అవుటయ్యాడు.
Kemar Roach Clean Bowled England Captain Joe Root on just 13 runs.#WIvENG pic.twitter.com/bIk92mjA3X
— Over Thinker Lawyer 🇵🇰 (@Muja_kyu_Nikala) March 8, 2022
Also read: AB De Villiers: మనసు మార్చుకున్న ఏబీ డివిలియర్స్, ఆర్సీబీతో మరోసారి ఒప్పందమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook