వరల్డ్ కప్ లో పాల్గొనే భారత జట్టు ఇదేనా ?

ప్రపంచం కప్ లాంటి మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. అయితే ప్రకటించింది బీసీసీఐ కాదు..గౌతం గంభీర్. ఇతను ఎలా ప్రకటిస్తాడు..ఎలాంటి హోదా లో ప్రకటిస్తారు అనేది తెలుసుకోవాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

Last Updated : Apr 15, 2019, 01:19 PM IST
వరల్డ్ కప్ లో పాల్గొనే  భారత జట్టు ఇదేనా ?

వరల్డ్ కప్ క్రికెట్ సమరం కోసం ఈ రోజు  బీసీసీఐ 15 మంది ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో ఎవరికి స్థానం లభిస్తుందన్న అంశంపై ఇటు క్రికెటర్లలోనే అటు అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత  నెలకొంది. ఈ తరుణంలో మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు. 
 

నాల్గో స్థానంపై క్లారిటీ ...

భారతజట్టులో నాల్గో స్థానంలో ఎవరికి ఎంపిక చేయాలనే అంశంపై సెలెక్టర్లు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఈ స్థానంలో అంబటి రాయుడు, అజింక్య రహానేలతో పాటు ఐపీఎల్‌లో ఇటీవలే సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ పేరును కూడా సెలక్టర్లు పరిశీలించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే వీరందరినీ కాదని సంజు శాంసన్‌కు గంభీర్ తన జట్టులో స్థానం కల్పించడం గమనార్హం.
 

ఆశ్చర్యపరిచే జట్టు కూర్పు
ప్రపంచకప్‌ జట్టులో చోటును ఆశిస్తున్న రిషభ్ పంత్, జడేజా, దినేశ్ కార్తీక్ లాంటి ఆటగాళ్లకు గంభీర్ తన జట్టులో చోటు కల్పించకపోవడం విశేషం. అసలు రేసులోనే లేని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, నాలుగో పేసర్‌గా నవదీప్ సైనీకి సైతం గంభీర్ చోటివ్వడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. 

గంభీర్ కలల జట్టు ఇదే...
* విరాట్ కోహ్లీ (కెప్టెన్)
*రోహిత్‌ శర్మ, 
*శిఖర్ ధావన్
*కేఎల్‌ రాహుల్‌
*ఎంఎస్ ధోనీ
*సంజ శాంసన్‌
*కేదార్‌ జాదవ్‌
* నవదీప్‌ సైనీ
*హార్దిక్‌ పాండ్యా
* భువనేశ్వర్‌ కుమార్‌
*జస్ప్రీత్ బుమ్రా
*మహమ్మద్ షమీ
*రవిచంద్రన్ అశ్విన్‌
*యుజ్వేంద్ర చాహల్‌
* కుల్దీప్‌ యాదవ్‌

గౌతం  గంభీర్ ప్రకటించిన జట్టులో ఎంత మందికి వరల్డ్ కప్ లో ఆడే ఛాన్స్ దొరుకుతుందనేది ఈ రోజు బీసీబీఐ ప్రకటనతో  తేలిపోతుంది.

Trending News