Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌ ఆస్తులు, భార్య వివరాలు ఇవే! మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం

Know all about Suryakumar Yadav Net worth and Wife Devisha Shetty details. 2016లో దేవిషా శెట్టిని భారత ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వివాహం చేసుకున్నాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Nov 7, 2022, 01:00 PM IST
  • సూర్యకుమార్‌ యాదవ్‌ ఆస్తులు
  • సూర్యకుమార్‌ యాదవ్‌ భార్య వివరాలు
  • సూర్యకుమార్‌ ఆసక్తికర విషయాలు
Suryakumar Yadav: సూర్యకుమార్‌ యాదవ్‌ ఆస్తులు, భార్య వివరాలు ఇవే! మరిన్ని ఆసక్తికర విషయాలు మీకోసం

Suryakumar Yadav Net worth and Wife Devisha Shetty details: టీ20 ప్రపంచకప్‌ 2022లో భారత ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లను ఊచకోత కోయడమే పనిగా పెట్టుకున్నాడు. తాజాగా జింబాబ్వేపై 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. సూపర్ 12 దశలో సూర్య ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో 225 పరుగులు చేశాడు. ప్రస్తుతం సూర్య తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సూర్యకు 'మిస్టర్ 360' అనే సరికొత్త ట్యాగ్ కూడా వచ్చింది. సూర్యకుమార్‌ గురించి తెలియని విషయాలు ఓసారి చూద్దాం. 

ర్యాంకింగ్స్‌లో నంబర్ 1:
టీ20 అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 ర్యాంక్‌ను అందుకున్న విషయం తెలిసిందే.  ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీస్, టీ20 ప్రపంచకప్‌ 2022లో అద్భుతంగా రాణించిన సూర్య.. 863 రేటింగ్ పాయింట్లతో నెంబర్ 1 ర్యాంక్‌కు దూసుకెళ్లాడు.

డ్యాన్స్ కోచ్:
2016లో దేవిషా శెట్టిని సూర్యకుమార్ యాదవ్ వివాహం చేసుకున్నాడు. దేవిషా డ్యాన్స్ కోచ్. ఆమె ముంబైలో డ్యాన్స్ ట్యూటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. బేకింగ్ మరియు వంట చేయడం ఆమెకు బాగా ఇష్టం. 

లగ్జరీ కార్లు:
సూర్యకుమార్ యాదవ్ వద్ద BMW 5 సిరీస్ 530d M స్పోర్ట్, ఆడి A6, రేంజ్ రోవర్, హ్యుందాయ్ i20, ఫార్చ్యూనర్ వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. సుజుకి హయాబుసా మరియు హార్లే-డేవిడ్సన్ వంటి స్పోర్ట్స్ బైక్‌లను కూడా సూర్య కలిగి ఉన్నాడు. 

నికర ఆస్తులు:
సూర్యకుమార్ యాదవ్ నికర ఆస్తుల విలువ దాదాపు రూ.15 కోట్లు. ఐపీఎల్ టీమ్ ముంబై ఇండియన్స్ అతనికి సంవత్సరానికి రూ. 3.2 కోట్లు చెల్లిస్తుంది. అతని నెలవారీ సంపాదన రూ. 10 నుండి 15 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే ఐపీఎల్ సమయంలో అవి రూ. 40 నుండి 50 లక్షల వరకు ఉంటుంది. 

1000 పరుగుల మార్క్‌:
ఒక క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో 1000 పరుగుల మార్క్‌ను చేరుకున్న తొలి భారతీయుడిగా సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2022లో 28వ ఇన్నింగ్స్‌లో ఈ మార్కును (1002) చేరుకున్నాడు. 

Also Read: రోహిత్ భాయ్.. ఒకే ఒక్క హగ్‌ అంటూ ఫ్యాన్ కన్నీటిపర్యంతం! గుండెలు పిండేసే వీడియో

Also Read: Ariyana Glory Hot Photos: ఓ మై గాడ్ అనిపించేలా అరియనా హాట్ ట్రీట్.. థైస్ షోతో రెచ్చిపోయింది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x