ICC Womens World Cup 2022: ఐసీసీ మహిళల ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో ఇండియా పరాజయం పాలైంది. భారీ ఛేజింగ్‌తో రికార్డు నెలకొల్పిన ఆస్ట్రేలియా సెమీ ఫైనల్స్‌కు చేరింది. మిథాలీ సేనకు ఇక జీవన్మరణ సమస్యగా మారింది.
ప్రపంచకప్ మహిళల క్రికెట్ టోర్నీలో ఆస్ట్రేలియా దూకుడుకు ఎదురులేకుండా పోయింది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ విజయం సాధించడమే కాకుండా తొలి సెమీ ఫైనలిస్ట్‌గా బర్త్ ఖరారు చేసుకుంది. అటు ఇండియా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌లలో మూడింట పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాతో ఓటమిపాలైంది మిధాలీ సేన. అదే సమయంలో ప్రపంచకప్ చరిత్రలో అతిపెద్ద ఛేజింగ్ సాధించింది ఆస్ట్రేలియా.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో మిథాలీ సేన ఓడిపోయింది. మిథాలీ సేన నిర్దేశించిన 278 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 4 వికెట్లు కోల్పోయి..మరో మూడు బంతులు మిగిలుండగానే అవలీలగా సాధించేసింది.ఆస్ట్రేలియన్ ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో ఇది సాధ్యమైంది. రేచల్ హన్స్ 43, అలిస్సా హీలీ 72 పరుగులు చేశారు. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్ 97 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక చివరి ఓవర్లలో బెత్ మూనీ 30 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఆసీస్ విజయం ఖరారైంది. ఈ ఓటమితో టీమ్ఇండియా ఇకపై ప్రపంచకప్‌లో ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆసీస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ సెమీస్‌కు చేరువైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 7 వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన , షెఫాలీ వర్మ విఫలమైనా.. కెప్టెన్ మిథాలీ రాజ్ 68, యస్తిక భాటియా 59 పరుగులతో రాణించారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో 57 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. అయితే బౌలింగ్ విభాగం విఫలం కావడంతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియాలో ఓపెనింగ్ జట్టు సెంచరీ భాగస్వామ్యం చేసింది. హన్స్, హీలీలు 121 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. కెప్టెన్ మాగ్ లెన్నింగ్, ఎల్లీస్ పెర్రీలు కూడా 103 పరుగుల భాగస్వామ్యం సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook