Fans Hails Hitman Rohit Sharma after hits 51 runs vs Bangladesh: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత్ ఐదు పరుగుల తేడాతో ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ 82 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చివరలో బ్యాటింగ్‌కు వచ్చి పోరాడినప్పటకీ జట్టును గెలిపించలేకపోయాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 271 రన్స్ చేసింది. మెహిదీ హసన్ (100 నాటౌట్) సెంచరీ బాదాడు.
272 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆరంభం దక్కలేదు. విరాట్ కోహ్లీ (5), శిఖర్ ధావన్ (8), వాషింగ్టన్ సుందర్ (11), కేఎల్ రాహుల్ (14) త్వరగానే ఔట్ అయ్యారు. దీంతో 65 పరుగులకే కీలక నాలుగో వికెట్‌లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు కలిసి ఐదో వికెట్‌కు శతక భాగస్వామ్యం నిర్మించారు. అయితే అయ్యర్, అక్షర్ పెవిలియన్ చేరడంతో భారత్ ఓడిపోవడం ఖాయం అనుకున్నారు.
ఫీల్డింగ్ సమయంలో గాయంతో పెవిలియన్‌కి చేరిన రోహిత్ శర్మ.. బ్యాటింగ్‌లో ఎనిమిదో డౌన్‌లో వచ్చాడు. అప్పటికి మ్యాచ్ భారత్ వైపు లేదు. రోహిత్‌కు గాయం అవడంతో ఏం ఆడుతాడని అందరూ అనుకున్నారు. అయితే చేతి బొటన వేలి గాయమైందనే విషయం కూడా ప్రేక్షకులు మరచిపోయేంతగా బ్యాటింగ్ చేశాడు. ఏకంగా ఐదు సిక్స్‌లు, మూడు ఫోర్లతో 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే చివరి బంతికి ఆరు పరుగులు కొట్టాల్సిన సమయంలో.. రోహిత్ భారీ షాట్ ఆడలేకపోయాడు. కెప్టెన్ రోహిత్ కడవరకు పోరాడి ఓటమిని అంగీకరించాడు.
గాయం తన పోరాట పటిమను ఏమాత్రం తగ్గించలేకపోయిందని రోహిత్ శర్మ నిరూపించాడు. మ్యాచ్ భారత్ ఓడినా.. రోహిత్ మాత్రం ప్రేక్షకుల మనుసు గెలుచుకున్నాడు. మైదానం నుంచి పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌ను టీమిండియా అభిమానులతో పాటు బంగ్లా ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా రోహిత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇలాంటి ఫీట్‌లు రోహిత్‌కే సాధ్యం, రోహిత్ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా, నువ్ 'మగధీర'లో హీరో అంటూ సోషల్ మీడియాలో ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మగధీర సినిమాలో హీరో రామ్ చరణ్ ను శ్రీహరి పొగిడే వీడియోను షేర్ చేస్తున్నారు.
Aslo Read: Waltair Veerayya Release Date: ఇట్స్ అఫీషియల్.. సంక్రాంతికే 'వాల్తేరు వీరయ్య'! పోస్టర్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.