Ind Vs Ban: మళ్లీ టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. రెండు కీలక మార్పులతో భారత్ బరిలోకి..

India Vs Bangladesh Toss: వరుసగా మూడో వన్డేలోనూ బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ గెలిచాడు. బంగ్లాదేశ్ క్లీన్‌స్వీప్‌పై కన్నేయగా.. పరువు నిలబెట్టుకునేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్‌కు రెండు జట్లు కూడా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 11:31 AM IST
  • టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి వన్డే
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లా
  • రెండు మార్పులతో రెండు జట్లు బరిలోకి..
Ind Vs Ban: మళ్లీ టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. రెండు కీలక మార్పులతో భారత్ బరిలోకి..

India Vs Bangladesh Toss: టీమిండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య ఆఖరి వన్డేకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న బంగ్లాదేశ్.. చివరి మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు వరుస ఓటములకు తోడు కీలక ఆటగాళ్లు గాయాల సమస్య తోడు భారత్‌ను వేధిస్తోంది. రోహిత్ శర్మ గాయం నుంచి తప్పుకోవడంతో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శనివారం చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఇషన్ కిషన్, కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. బంగ్లా కూడా రెండు మార్పులతో తుది జట్టును ప్రకటించింది.

 

'మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వికెట్‌పై కొంత గడ్డి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆరంభంలోనే వికెట్లు తీయాలి. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నాం..' అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ తెలిపాడు.

'గాయాలు కొంతమంది ఆటగాళ్లు దూరం అయ్యారు. కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశాలు కల్పిస్తున్నానం. రెండు మార్పులతో మ్యాచ్‌ ఆడుతున్నాం. రోహిత్ శర్మ, దీపక్ చాహర్ స్థానంలో ఇషాన్, కుల్దీప్ వచ్చారు. మేం ఉత్తమ జట్టుతోనే బరిలోకి దిగుతున్నాం. ఎల్లప్పుడు దేశం కోసం ఉత్తమ ప్రదర్శన కనబర్చేందుకే ప్రయత్నిస్తాం. కొన్నిసార్లు అది కుదరకపోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. ఇది కొత్త వికెట్. భిన్నమైన పరిస్థితులు. బంగ్లాపై ఒత్తిడిని తిరిగి తీసుకురావడం ముఖ్యం..' అని కెప్టెన్ రాహుల్ తెలిపాడు. 

తుది జట్లు: 

బంగ్లాదేశ్: అనముల్ హక్, లిట్టన్ దాస్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, యాసిర్ అలీ, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, అఫీఫ్ హుస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, ఎబాడోత్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్, తస్కిన్ అహ్మద్.

భారత్: శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్, వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

Also Read: YSRCP Twitter: వైసీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. పిచ్చి పిచ్చి ట్వీట్లు  

Also Read:  Cyclone Mandous: తీరం దాటిన మాండూస్ తుఫాన్.. భారీ నుంచి అతిభారీ వర్షాలు  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x